వండిన కూరగాయలు..ఎంతసేపట్లో జీర్ణం అవుతాయో తెలుసా?

51
- Advertisement -

కూరగాయలు ప్రతిరోజూ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయని, అనారోగ్య సమస్యల నుంచి ఇట్టే బయటపడవచ్చని వైద్యులు, ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. కూరగాయలలో లెక్కకు మించిన రకాలు మనకు కనిపిస్తాయి, టమాటో, ఉల్లిపాయ, బంగాళాదుంప, పచ్చిమిర్చి, బీట్రూట్, దొండకాయ, బెండకాయ.. ఇలా చెప్పుకుంటూ పోతే కూరగాయల లిస్ట్ చాలా పెద్దగానే ఉంటుంది.

ఈ కూరగాయలలో ఒకటి లేదా రెండు రకాలు ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఉపయోగిస్తూనే ఉంటాము. అయితే మాములుగా అయితే చికెన్ లాంటి మాంసాకృత్తులైతే జీర్ణం కావడానికి 90 నుండి 120 నిమిషాలు పడుతుంది. అదే మటన్ అయితే మరిన్ని గంటల సమయం పడుతుంది. అదే కూరగాయలతో వండిన భోజనాన్ని లాగిస్తే కేవలం 40 నిమిషాల్లో జీర్ణమై ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతంది.

Also Read:Beef:బీఫ్‌ ఎక్కువగా తింటున్నారా?

మాంసాహారంలో ఉండే పోషకాల కన్నా కూరగాయలలో ఉండే పోషక విలువలే ఎక్కువని మనశరీరానికి కావలసిన శక్తిని ఇస్తాయని నిపుణులు చెబుతుంటారు. కూరగాయలలో సహజంగానే కొవ్వు శాతం, కెలోరీల శాతం తక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం చాలా తక్కువ. కూరగాయలలో విటమిన్లు, ప్రోటీన్లు, సూక్ష్మ పోషకాలు.. ఇలా మనశరీరానికి కావలసిన అన్నీ పోషకాలు సమృద్దిగా ఉంటాయి. అందువల్లే మాంసాహారం కంటే కూడా కూరగాయలే ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:ఇవి పాటిస్తే.. బాడీఫిట్నెస్ సూపర్ !

- Advertisement -