ప్చ్.. సింగర్స్ బ్యాడ్ టైమ్ నడుస్తోంది

48
- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా సింగర్స్ కి ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తోంది. సౌత్ కొరియాకు చెందిన గాయకుడు చోయ్ సంగ్ బాంగ్ (33) దక్షిణ సియోలో‌లో తన ఇంట్లో శవమై కనిపించాడు. అంతకు మందు ఆయన సూసైడ్ చేసుకోబోతున్నట్లు యూట్యూబ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. దీంతో పోలీసులు చోయ్ సంగ్‌ది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. కాగా.. చోయ్ సంగ్ తనకు రకరకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయని చికిత్స కోసం దాతల నుంచి డొనేషన్స్ వసూలు చేసినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కొన్నాడు. మొత్తానికి ఓ మంచి సింగర్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమైన విషయం.

అలాగే, ప్రముఖ బాలీవుడ్ సింగర్ రాపర్ హనీ సింగ్‌కు హత్య బెదిరింపులు రావడంతో ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ నుంచి తనకు బెదిరింపులు రాగ, భద్రత కల్పించాలని పోలీసులను కోరాడు. నా మేనేజర్‌కి నన్ను చంపేస్తానని బెదిరింపు కాల్‌ తో పాటు రూ.50 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:NTR:దేవరలో మలయాళ స్టార్!

అదేవిధంగా యాదృచ్ఛికంగా న్యూయార్క్‌లోని పబ్లిక్ కన్సర్ట్‌లో బేబీ రెక్సా అనే పాప్ సింగర్ పాట పాడుతున్న క్రమంలో ఆమెపై తన అభిమాని నికోలస్ మాల్వాగ్నా అనే వ్యక్తి ఫోన్ విసిరేశాడు. దాంతో ఆ ఫోన్ ఆమె ముఖం మీద బలంగా తాకడంతో రెక్సా అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే అక్కడి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. అనంతరం సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. కాగా, ఆమె చూడ్డానికి ఫన్నీగా ఉండడంతో అలా చేశానని మాల్వాగ్నా చెప్పడం గమనార్హం. మొత్తానికి ప్రస్తుతం సింగర్స్ కి బ్యాడ్ టైమ్ నడుస్తోంది.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -