అమరుల త్యాగాలతో 4 కోట్ల ప్రజల సేవలో పునరంకితం అవుతామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఇవాళ సాయంత్రం అమరజ్యోతి ప్రారంభం సందర్భంగా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు కేటీఆర్. త్యాగధనులను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటామని..తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని పేర్కొన్నారు.
Also Read:NTR:దేవరలో మలయాళ స్టార్!
అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడమని చెప్పారు. దశాబ్దాలుగా పట్టిపీడించిన సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి.. తెలంగాణ సమాజాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కించడమన్నారు.తొమ్మిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేర్చి, వచ్చే వందేండ్లకు బలమైన పునాది వేసిన సంకల్పమే యావత్ దేశానికి.. తెలంగాణ నేర్పుతున్న పరిపాలనా పాఠమన్నారు.
ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతం..
ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికం..
తెలంగాణ సాధనోద్యమంమన అమరుల ఆశయం..
కేవలం స్వపరిపాలన మాత్రమే కాదు…
సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజలకు అందించడం..దశాబ్దాలుగా పట్టిపీడించిన..
సకల దరిద్రాలను శాశ్వతంగా దూరంచేసి…
తెలంగాణ సమాజాన్ని కష్టాల… pic.twitter.com/oSnz5OrT6D— KTR (@KTRBRS) June 22, 2023