తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని కూడా తెలిపారు. బుధవారం నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
Also Read: Heatwaves:ఆ రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక..!
ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఏపీలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. రాబోయే రోజుల్లో దక్షిణభారతదేశమంతా విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఏపీలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: KTR:విద్యతోనే వికాసం.. విద్యతోనే ఆత్మవిశ్వాసం