తెలంగాణలో హంగ్.. గ్యారెంటీ ?

49
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి విజయంపై బి‌ఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా గట్టిగానే కన్నేయడంతో రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇక ఎన్నికలు దగ్గర పడే కొద్ది సర్వేలు, విశ్లేషణల హడావిడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ప్రజల్లో పార్టీ ల నాడీని బట్టి సర్వేలు బయటకు వస్తుంటాయి. అయితే కొన్ని సర్వేలు ప్రజా నాడీని అంచనా వేయడంలో నిక్కచ్చితమైన ఫలితాలను ఇస్తుంటాయి. మరికొన్ని పార్టీలకు అనుకూలంగా తూ తూ మంత్రంగా తెరపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా ఓ సంచలన సర్వేను బయట పెట్టారు. రాబోయే ఎన్నికలతో తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందని ఆయన చెబుతున్నారు.

Also Read:స్క్వాట్స్ వ్యాయామం చేయడం మంచిదేనా..?

బి‌ఆర్‌ఎస్ 45 సీట్లు, కాంగ్రెస్ 45 సీట్లు, బీజేపీ 7 సీట్లు, ఏం ఐ ఏం 7 సీట్లు, సాధిస్తాయని.. మరో 15 స్థానాల్లో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని తాజాగా ఓ సర్వేను బయట పెట్టారు రేవంత్ రెడ్డి. ఇక ఓటు శాతాన్ని బట్టి చూస్తే బి‌ఆర్‌ఎస్ కు 37 శాతం, కాంగ్రెస్ కు 34 శాతం, బీజేపీ 14 శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డి చెప్పిన దాని ప్రకారం చూస్తే తెలంగాణలో హంగ్ ఏర్పడుతుందనేది అంచనా. అయితే ఈ సర్వే ఫలితాలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయనేది కూడా ఒక సందేహమే. ప్రస్తుతం రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఈసారి బి‌ఆర్‌ఎస్ 100 కు పైగా సీట్లు సాధించే అవకాశం ఉందని పలు సర్వేలు విశ్లేషణలు కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ప్రకటించిన సర్వే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి హైప్ ఇచ్చేందుకే తప్పా.. ఇంకోటి లేదనేది మెజారిటీ ప్రజల నుంచి వస్తున్న మాట

- Advertisement -