స్క్వాట్స్ వ్యాయామం చేయడం మంచిదేనా?

52
squats
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతిరోజూ వ్యాయామానికి సమయం కేటాయించడం ఎంతో అవసరం. ఎందుకటే ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టూ మూడతాయి. అందువల్ల ప్రతిరోజూ వ్యాయామం కోసం ఒక అరగంట అయిన తప్పనిసరిగా టైమ్ కేటాయించాల్సిన పరిస్థితి. అయితే కొంతమంది శారీరక కసరత్తు చేయలేని వాళ్ళు యోగా వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. యోగా కు కూడా సమయం కేటాయించలేని వాళ్ళు.. ప్లాంక్స్, స్క్వాట్స్ వంటి వ్యాయామ కసరత్తులు చేసిన రోజంగా ఉల్లాసంగా ఉండడానికి దోహదం చేస్తుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

ప్రతిరోజూ స్క్వాట్స్ చేయడం వల్ల ప్రేగులలోనూ, జీర్ణక్రియలలోనూ కదలికలు మెరుగుపడి.. ఎలాంటి జీర్ణ సమస్యలైన దూరమౌతాయట. ముఖ్యంగా మలబద్దకం నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. స్క్వాట్స్ అనేది క్రమం తప్పకుండా చేయడం వల్ల కండరాలు యాక్టివ్ గా మారతాయి. అలాగే శరీరానికి సరైన సమతుల్యత లభిస్తుంది. కండరాలు దృఢంగా అవ్వడంతో పాటు పొట్ట చుట్టూ పెరుకుపోయిన కొవ్వును కరిగించడంలో కూడా స్క్వాట్స్ వ్యాయామం చక్కగా ఉపయోగపడుతుందట. ఈ వ్యాయామం చేస్తున్నప్పుడు కీళ్ల చుట్టూ రక్తప్రసరణ మెరుగుపడడంతో పాటు ఆక్సిజన్ పెరుగుతుంది. ఇంకా కాళ్ళకు పటుత్వాన్ని పెంచడంలోనూ కాళ్ళ యొక్క కండరాలను బలపరచడంలోనూ స్క్వాట్స్ వ్యాయామం ఎంతో ఉపయోగ కరంగా ఉంటుందని ఫిట్ నెస్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: నా సామిరంగ… మంగగా మిర్నా మీనన్

స్క్వాట్స్ చేయు విధానం
ముందుగా చదునైన నేలపై లేదా యోగా మ్యాట్ పై నాటారుగా నిలబడాలి. ఆ తరువాత కాస్త ఊపిరి తీసుకొని కాళ్ళను కొద్దిగా ఎడంగా జరిపి రెండు చేతులను ఒకదానినొకటి పట్టుకొని ఛాతీ భాగం వద్ద ఉంచాలి. తరువాత శ్వాస క్రియ నెమ్మదిగా జరిగిస్తూ కాళ్ళ పిక్కల భాగం వరకు పైకి కిందకి రిపిటేషన్స్ చేయాలి. ఇలా వీలైనంత సమయం స్క్వాట్స్ వ్యాయామం చేయాలి.

గమనిక
నడుం నొప్పి అధికంగా ఉన్నవాళ్ళు స్క్వాట్స్ చేయరాదు.

 

- Advertisement -