ఆదిపురుష్ పై వివాదాలు ఇవే

51
- Advertisement -

భారీ అంచనాల మధ్య ఈరోజు ఆదిపురుష్ చిత్రం విడుదలైంది. తాజాగా నేపాల్ లో ఈ సినిమాపై వివాదం తలెత్తింది. సీత భారత్ లో జన్మించినట్లు చూపించడంపై నేపాల్ సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపింది. ఇది సవరించకుంటే మూవీ విడుదలకు అనుమతినివ్వం అని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన డైలాగ్ ను మూవీ నుంచి తొలగించడంతో నేపాల్ లో మూవీ విడుదలకు లైన్ క్లియర్ అయింది. కానీ మార్నింగ్ షోలు నిలిపివేసినట్లు సమాచారం.

మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆదిపురుష్ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంజనేయ స్వామికి టికెట్ రిజర్వ్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం దేవుడిని అవమానించినట్టే అవుతుందని ఆయన వెల్లడించారు. ఆయనకు థియేటర్ ను సంజీవని పర్వతంలా ఎత్తుకెళ్లే సత్తా ఉందని, కానీ ఇలా సీటు వేరు చేసి చూడటం ఏంటో అర్థం కావడం లేదు.. ఆంజనేయుడికి సీటు కేటాయించాల్సిన అవసరం లేదని వర్మ చెప్పుకొచ్చారు.

Also Read: దేవాస్‌ మీడియాలో శ్రవణ్‌రెడ్డి

హనుమంతుడికి కేటాయించిన సీట్లో ఓ ప్రేక్షకుడు కూర్చున్నాడని హైదరాబాద్ లోని భ్రమరాంబ థియేటర్లో దాడి చేశారు. థియేటర్ సిబ్బంది వచ్చి గొడవ సద్దుమణిగేలా చూసి ఆ వ్యక్తిని మరో సీట్లో కూర్చోబెట్టారు. సీటులో కూర్చున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నట్లు ఫ్యాన్స్ తెలిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: సిద్ధార్థ్ రాయ్..చెలియా చాలు

- Advertisement -