బి‌ఆర్‌ఎస్.. సింగిల్ గానే బరిలోకి ?

41
- Advertisement -

ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ పార్టీ మహారాష్ట్రలో వేగంగా విస్తరిస్తోంది. ఇతరత్రా పార్టీలకు సంబంధించిన నేతలు వరుసబెట్టి బి‌ఆర్‌ఎస్ లో చేరుతుండడంతో ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది. ఇక రాష్ట్రంలో పార్టీకి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకొని అధినేత కే‌సి‌ఆర్ కూడా అక్కడే బహిరంగ సభలు, పర్యటనలు చేస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంచితే ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ కు పెరుగుతున్న బలాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. మహారాష్ట్రలో బి‌ఆర్‌ఎస్ స్టాండ్ ఏంటి ? ఏ పార్టీతో పొత్తు కలవబోతుంది ? ఏ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది ? అనే ప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.

Also Read: చేరికలపైనే.. బీజేపీ భారం ?

దీంతో ఈ ప్రశ్నలన్నిటికి తాజాగా అధినేత కే‌సి‌ఆర్ సమాధానం ఇచ్చారు. మహారాష్ట్రలోని ప్రతి ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ పోటీ చేస్తుందని, గెలుపోటములతో సంబంధం లేకుండా బి‌ఆర్‌ఎస్ పోటీ చేస్తుందని కే‌సి‌ఆర్ స్పష్టం చేశారు. అదే విధంగా ఎన్నికల్లో పొత్తులపై కూడా కే‌సి‌ఆర్ స్పష్టమైన వైఖరిని కనబరిచారు. ఏ పార్టీతో బి‌ఆర్‌ఎస్ కు పొత్తు ఉండబోదని, తమ విధానాలు సిద్దాంతలు చాలా వేరని చెప్పుకొచ్చారు కే‌సి‌ఆర్. బి‌ఆర్‌ఎస్ ఒక నిర్ధిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతోందని, లక్ష్యాన్ని చేరే వరకు పోరాడుతూనే ఉంటామని కే‌సి‌ఆర్ స్పష్టం చేశారు. దీంతో వచ్చే మహారాష్ట్ర ఎన్నికల్లో కే‌సి‌ఆర్ సింగిల్ గా బరిలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో శివసేన పార్టీ రెండు వర్గాలు, బీజేపీ, ఎన్సీపీ వంటి పార్టీల ప్రభావం గట్టిగానే ఉంటుంది. కానీ ఆ పార్టీలన్నీ ఇప్పుడు రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో బి‌ఆర్‌ఎస్ సింగిల్ గా బరిలోకి దిగిన మహారాష్ట్రలో సత్తా చాటే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: చంద్రబాబును టెన్షన్ పెడుతున్న పవన్ ?

- Advertisement -