యూట్యూబ్ లో ఆదిపురుష్ లీక్

59
- Advertisement -

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ, ఈ సినిమా విడుదలకు ముందే ఆన్ లైన్ లో కొంతభాగం లీక్ అవ్వడం చిత్రబృందాన్ని కంగారు పెడుతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని కీలక సన్నివేశాలు యూట్యూబ్ లో లీక్ అయ్యాయి. ఎలా లీక్ అయ్యాయి?, ఎవ్వరూ లీక్ చేశారు అని ప్రస్తుతం చెక్ చేస్తున్నారు. ఈ లీక్ వీడియోల పై మేకర్స్ మండిపడుతున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లో సినిమా చూసిన ప్రేక్షకులు దర్శకుడు ఓంరౌత్‌పై ఫైర్ అవుతున్నారు. సినిమా గురించి ఓ మహిళ మాట్లాడుతూ.. ‘సినిమా వరస్ట్‌గా ఉంది’ అని తెలిపింది. మరో అభిమాని ‘రామాయణం ఎవరైనా ఇలా తీస్తారా?’ అంటూ ఫైర్ అయ్యాడు. ఓ ప్రేక్షుడు ఏకంగా ‘ఓంరౌత్‌ను చంపేస్తా‘ అంటూ హెచ్చరించాడు. మొత్తానికి ఆదిపురుష్ డైరెక్టర్‌‌పై ప్రేక్షకులు ఫైర్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు సినిమా పై బాగా నెగిటివ్ టాక్ ఉంది అని తెలుస్తోంది.

Also Read:Adipurush: ఎలా ఉందంటే?

అయితే, కొన్ని చోట్ల మాత్రం ఈ సినిమాకి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మొత్తమ్మీద ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ ఉంది. ఆదిపురుష్ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆదిపురుష్ ఓటీటీ స్ట్రీమింగ్ థియేట్రికల్ రిలీజైన ఎనిమిది వారాల తరువాత రానుందట. అంటే ఈసినిమా 56 రోజుల తరువాత ఓటీటీకి వస్తుందన్న మాట. ఎలాగూ థియేటర్స్ లో భారీ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారు కాబట్టి.. ఆదిపురుష్ ఓటీటీ రాక ఎదురు చూడాల్సిందే.

Also Read:ఐరన్ లోపిస్తే.. అంతేనా?

- Advertisement -