చేరికలపైనే.. బీజేపీ భారం ?

48
- Advertisement -

తెలంగాణలో విజయం కోసం బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. నిజంగా ఆ పార్టీ అధికారంలోకి వచ్చేంతా బలంగా ఉందా అంటే అది లేదు. కానీ విజయం మాదే అంటూ కమలనాథులు చెబుతున్నారు. గత ఎన్నికల టైమ్ తో పోల్చితే ప్రస్తుతం బీజేపీ కొంత మెరుగుపడినప్పటికి అధికారం దక్కించుకునేంత బలం లేదనేది కమలనాథులు కూడా ఒప్పుకోవాల్సిన సత్యం. ప్రస్తుతం రాష్ట్రంలో బి‌ఆర్‌ఎస్ బలమైన శక్తిగా వచ్చే ఎన్నికల్లో కూడా విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది. బి‌ఆర్‌ఎస్ తరువాత కాంగ్రెస్ 30 నుంచి 40 స్థానాల్లో మెరుగైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరి బీజేపీ సంగతేంటి అంటే ఆ పార్టీకి ఆయా నియోజిక వర్గాల వారిగా అభ్యర్థులే లేని పరిస్థితి. మరి ఇవన్నీ గమనిస్తే గెలుపు విషయంలో బీజేపీ చెబుతునవన్ని ఒట్టి మాటలే తప్పా గట్టి మాటలు కాదనేది స్పష్టంగా అర్థమౌతోంది. బి‌ఆర్‌ఎస్ 100 సీట్లకు పైగా గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తోంది. అటు కాంగ్రెస్ కూడా 70 నుంచి 80 స్థానాల్లో విజయం మాదే అని చెబుతోంది. కానీ బీజేపీ మాత్రం సీట్ల విషయంలో ఈ కాన్ఫిడెన్స్ ను వ్యక్త పరచడం లేదు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు బీజేపీ చెబుతునవన్ని ఒట్టి మాటలేనని.

Also Read: CMKCR:నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్‌ కార్యాలయం ప్రారంభం

ఎంతో కొంత బీజేపీ గెలుపు అవకాశాలున్న సీట్లను గమనిస్తే.. హుజూరాబాద్, దుబ్బాక, మునుగోడు, అంబర్ పేట, వేములవాడ, ముషీరాబాద్, ఖైరతాబాద్, ఆదిలాబాద్, గద్వాల్, కరీంనగర్.. వంటి నియోజిక వర్గాల పేర్లు చెప్పుకోవచ్చు. వీటిలో కూడా కచ్చితంగా గెలుస్తుందని చెప్పడం ఊహాజనితమే. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీ గెలుపు కోసం చేరికలపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇతర పార్టీలలో నుంచి బీజేపీలో చేరే నేతలతోనే బలం పెంచుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతం చేరికలపై బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికి ఆశించిన స్థాయిలో చేరికలు కూడా జరగడం లేదు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై బీజేపీ చూపిస్తున్న ధీమా.. తూ తూ మంత్రమనే చెప్పాలి.

Also Read: సక్సెస్ ఫార్ములా వెంటే.. కాంగ్రెస్, టీడీపీ ?

- Advertisement -