రకుల్ ప్రీత్ సింగ్ ఓ సినిమా షూటింగ్‌లో చేసిన పనికి కొందరు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఐ లవ్ యూ సినిమాలో నటిస్తున్న రకుల్ ఓ షాట్ కోసం నీటి అడుగున రెండు నిమిషాల పాటు ఉంది. ఈ సీన్‌కు నెటిజన్లు రకుల్ చాలా గ్రేట్ అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే మూవీలో ఈ కీలకమైన సీన్ కోసం రకుల్ చాలా కష్టపడింది. కొద్ది నిమిషాల పాటు ఊపిరి బిగబట్టి ఉండేందుకు రకుల్ యోగాసనాలు కూడా ప్రాక్టీస్ చేసింది. మొత్తానికి ఓ సినిమా కోసం బోల్డ్ సన్నివేశాలనే కాదు, రిస్క్ సీన్స్ ను కూడా అవలీలగా చేస్తాను అని రకుల్ ఇన్ డైరెక్ట్ గా చెప్పినట్టు అయింది.
అయితే, రకుల్ ప్రీత్ సింగ్ గురించి తెలిసిన వారు ఆమె మరోలా చెబుతున్నారు. ఆమె ఏం చేసినా డబ్బు కోసమే చేస్తోందని.. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ లో సెటిల్ కావడానికి కష్ట పడుతుంది అని.. సౌత్ లో కంటే కూడా నార్త్ లో ముఖ్యంగా హిందీ చిత్రాల్లో ఎక్కువ పారితోషికం ఇస్తారని.. గత నాలుగేళ్లుగా ముంబైలోనే మకాం వేసి.. ఛాన్స్ కోసం దర్శకనిర్మాతల చుట్టూ తిరుగుతుంది అని, ఆమెకు డబ్బు పిచ్చి ఎక్కువ అని ఆమె అంటే గిట్టని వారు ప్రచారం చేసున్నారు. మొత్తమ్మీద రకుల్ ప్రీత్ సింగ్ అంటేనే డబ్బు మనిషి అని చెబుతున్నారు.
Also Read: ‘ఆదిపురుష్’కి ఫస్ట్ డే 150 కోట్లు ?
పైగా, రకుల్ కి పెద్దగా టాలెంట్ లేకపోయినా ఫుల్ గ్లామర్ షో చేసి పైకి వచ్చింది అని, ఆమె ఎక్స్ ప్రెషన్స్ పలికించలేకపోయనా ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోందని, అసలు రకుల్ ప్రీత్ సింగ్ ని ఓ నటిగా గౌరవించాల్సిన పని లేదు అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. మరి ఈ కూతల పై రకుల్ బ్యూటీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
Also Read: రాజకీయాల్లోకి రాను:మనోజ్ బాజ్‌పేయి

