ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. రేపు ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకురాగా అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆదిపురుష్ హంగామా తారాస్ధాయికి చేరింది.
దీనికి తోడు తెలంగాణ సర్కార్ అదనపు షోకి అనుమతివ్వగా ఏపీ సర్కార్ టికెట్ రేట్ల పెంపుపై గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో ఆరో షోతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 3 రోజుల పాటు రూ. 50 పెంచుకునేందుకు అనుమతిచ్చింది. అయితే ఏపీ సర్కార్ మాత్రం కేవలం టికెట్ ధరలను మాత్రమే పెంచుకునేలా జీవో జారీ చేసింది.
Also Read:బీజేపీ ” సినీ గాలం “.. వర్కౌట్ అవుతుందా ?
10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్సుల్లో టికెట్‌పై రూ.50 పెంచుకునేలా వెసులుబాటును కల్పించింది. దీంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆదిపురుష్ చిత్రాన్ని చూడాలంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 115కి మరో రూ. 50 అదనంగా చెల్లాంచాల్సి ఉంటుంది. మల్టీప్లెక్స్‌లో చూడాలంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 177కి మరో రూ. 50 అదనంగా చెల్లించాలి. 3డి వెర్షన్ చూసే వారు గ్లాసెస్‌కి అదనంగా అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది.
ప్రభాస్ శ్రీరాముడిగా కృతిసనన్ జానకిగా నటించింది. సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే, వత్సల్ సేన్, సోనాల్ చౌహాన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. టి సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు నిర్మించారు.
Also Read:పవన్ విజయ యాత్ర.. లక్ష్యమదే !