దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు మహిళ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ సంజయ్ ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆడబిడ్డ తలుచుకుంది..ఇక మీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి గౌరవం దక్కదు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు.
Also Read: Kavitha:ఆడబిడ్డకు అన్ని తానై నిలిచిన నేత సీఎం కేసీఆర్
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం మీకు కనిపించడం లేదా? అని సంజయ్‌ను కవిత ప్రశ్నించారు. బేటీ బచావో… బేటీ పడావో నినాదాలకే పరిమితమైందని కవిత ధ్వజమెత్తారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్‌లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి నెలకొందన్నారు. మహిళలకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం అని కవిత సంజయ్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
Also Read: June13:గ్రే హౌండ్స్ గురువు ఎన్ఎస్ భాటి వర్ధంతి