ఫీల్ అవుతోన్న కీర్తి సురేష్

43
- Advertisement -

హీరోయిన్ కీర్తి సురేష్‌ ప్రేమ,పెళ్లి అంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఓ వ్యాపార వేత్తతో త్వరలో కీర్తీ సురేష్‌ పెళ్లి కాబోతుందని బాగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై అటు కీర్తీ సురేష్, ఇటు ఆమె తల్లి మేనక ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయినా పుకార్లు మాత్రం ఆగడం లేదు. దీంతో.. పెళ్లి మాట ఎత్తొద్దు ప్లీజ్ అంటూ కీర్తి సురేష్ రిక్వెస్ట్ చేస్తోంది. ఇప్పుడు ఏ సినిమా గురించి ప్రచారం చేసినా కీర్తి సురేష్ అనివార్యంగా పెళ్లి ప్రస్తావన ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇక ఆమె తాజాగా చెన్నైలో ఓ షో ప్రారంభానికి వెళ్ళింది.

Also Read: ఆమె అందం యూత్ కి ఎనర్జీ అట

అక్కడ కూడా కీర్తి సురేష్‌ ‘పెళ్లి’ చుట్టే తిరిగాయి వార్తలు. దాంతో, తన పెళ్లి గురించి ప్రశ్నలు ఇంకా ఎక్కువ ఎదురవుతుండటం చాలా బాధాకరం అని కీర్తి రియాక్ట్ అయింది. ఐతే, నా పర్సనల్ విషయాలు కాకుండా సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే మాట్లాడుదామని మీడియాని కోరుతోంది. గత కొన్ని రోజులుగా పర్హాన్ బీన్ లియాకత్‌ అనే వ్యక్తితో కీర్తి సురేష్ చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. ఐతే అతను తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని, తనకు నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని కీర్తి సురేష్‌ చెప్పింది. మొత్తానికి తన పెళ్లి పై వచ్చే పుకార్ల విషయంలో కీర్తి సురేష్ బాగా ఫీల్ అవుతుంది.

Also Read: ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ టార్గెట్ అదే

- Advertisement -