జోగులాంబ గద్వాల జిల్లాపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో పంచాయితీలకు మండల కేంద్రాలకు మున్సిపాలటీలకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. గద్వాల జిల్లాలోని 255గ్రామ పంచాయతీలు…12మండలాలు..నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి రూ.10లక్షల చొప్పున ప్రత్యేక గ్రాంట్ మంజూరు చేస్తున్నాం. గద్వాల మున్సిపాలిటీకి రూ.50కోట్లను అభివృద్ధి కోసం కేటాయిస్తున్నట్టు తెలిపారు. మిగిలిన మున్సిపాలిటీలకు రూ.25కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్టు స్పష్టం చేశారు.
తెలంగాణ సాధించుకున్న తర్వాత పరిపాలన సంస్కరణలు చేసుకున్నాం. రాజభవనాలను తలపించే కలెక్టరేట్ పోలీసు భవనాలు ప్రారంభించుకున్నాం. ఇదంతా ప్రజలు బాగుండాలని జోగులాంబ గద్వాల జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గట్టు పునాదిరాయి వేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలోనే పూర్తయి వాటి ద్వారా సాగునీరు అందుతుందని కేసీఆర్ తెలిపారు. నెట్టెంపాడు బీమా ద్వారా ఇప్పటికే నీళ్లు అందుతున్నాయని తెలిపారు.
కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, బీమా అన్నింటిని పూర్తి చేసుకుని 15 నుంచి 24 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చుకుంటున్నాం. ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అని కేసీఆర్ వివరించారు. తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఆర్డీఎస్‌ను మళ్లీ సాధించుకున్నాం. అలంపూర్ కూడా అద్భుతంగా తయారు కాబోతుంది. గట్టు ఎత్తిపోతల పూర్తయితే గద్వాల వజ్రపు, బంగారు తునక అవుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
గురుకుల పాఠశాలలల్లో గిరిజన, దళిత, బీసీ బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. పిల్లలు మంచిగా చదవుకుంటున్నారు అని కేసీఆర్ తెలిపారు. గద్వాల జిల్లాకు మెడికల్ కాలేజీ కూడా రాబోతుందని కేసీఆర్ తెలిపారు. ఈ రోజు దేశంలో తెలంగాణ అనేక రంగాల్లో అగ్రస్థానంలో ఉంది. పర్ క్యాపిట ఇన్‌కంలో, పర్ క్యాపిట పవర్ యుటిలైజేషన్‌లో, ఓడీఎప్ ప్లస్‌లో కూడా నంబర్ వన్‌లో ఉన్నాం.
Also Read: కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..
గతంలో బతుకు లేక వలస పోయినం కానీ ఇప్పుడు నెట్టెంపాడు గట్టు తుమ్మిళ్ల లాంటి ప్రాజెక్ట్‌లతో జలకళను సంతరించుకొంది. కానీ ఇప్పుడు వలసలు లేవు. బంగారు పంటలను పండించుకుంటున్నామని అన్నారు. ప్రపంచంలో ఎవరూ ఆలోచించని విధంగా కంటి వెలుగు కార్యక్రమం తీసుకున్నాం. ఇలాంటి హ్యుమన్ యాంగిల్ ప్రపంచంలో ఎక్కడా కనిపించదు. ప్రజల ఆయురారోగ్యాలు బాగుండాలని అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.
Also Read: KCR:ధరణి ఉంది…రాబంధులు లేరు