ఈ వారం భారీ సినిమా ఆది పురుష్ రాబోతుంది. అందుకే, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలాగే మరోవైపు ఓటీటీల జోరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రేక్షకులు ఈ వారం కూడా ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి
ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!
‘ఆది పురుష్’ :
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ‘ఆది పురుష్’. ఈ సినిమా జూన్ 16న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతుంది.
‘ది ఫ్లాష్’ :
మిల్లర్ కీలక పాత్రలో ఆండీ మూషియాటీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది ఫ్లాష్’. ఇంగ్లీష్‌తో పాటు భారతీయ భాషల్లోనూ జూన్ 15న ఈ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది.
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
అడైమగై కాలం (తమిళం) జూన్ 11వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఎక్స్‌ట్రాక్షన్ 2 (హాలీవుడ్) జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
Also Read:కొండెక్కిన చికెన్..మరింత పెరిగే అవకాశం!
అమెజాన్ ప్రైమ్ లో ప్రసారాలు ఇవే :
జీ కర్దా (హిందీ) జూన్ 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
రావణకొట్టం (తమిళం) జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ+హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇవే :
ఫుల్ కౌంట్ (కొరియన్ సిరీస్) జూన్ 14 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
షెవలియర్ (హాలీవుడ్) జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
బిచ్చగాడు2 (తమిళం) జూన్ 17 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సైతాన్ (తెలుగు సిరీస్) జూన్ 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సోనీలివ్ లో ప్రసారాలు ఇవే :
ఫర్హానా (తమిళ చిత్రం) జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
లయన్స్ గేట్‌ప్లే లో ప్రసారాలు ఇవే :
డెస్పరేట్ రైడర్స్ (హాలీవుడ్) జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జియో సినిమా లో ప్రసారాలు ఇవే :
రఫూచక్కర్ (హిందీ సిరీస్) జూన్ 15 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఐ లవ్ యూ (హిందీ చిత్రం)జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఈటీవీ విన్ లో ప్రసారాలు ఇవే :
కనులు తెరిచినా కనులు మూసినా (తెలుగు) జూన్ 16 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మనోరమా మ్యాక్స్ లో ప్రసారాలు ఇవే :
వామనన్ (మలయాళం) జూన్ 16వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.