ముందస్తు ఎన్నికలా.. జగన్ మాటేంటి !

75
- Advertisement -

ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే సూచన ఉందంటూ ఏపీలో గత కొన్నాళ్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు కూడా ఎన్నికల మూడ్ లోకి రావడంతో ముందస్తు ఎన్నికలు ఖాయమనే భావన అందరిలోనూ కలిగింది. సి‌ఎం జగన్ వైసీపీ నేతలకు ఎన్నికలే టార్గెట్ గా ముందుకు కదులుతుండడం, టీడీపీ అధినేత చంద్రబాబు అందరికంటే ముందే మేనిఫెస్టో ప్రకటించడం, పవన్ కూడా ప్రచారానికి సిద్దమౌతుండడంతో ముందస్తు ఎన్నికలు ఖాయమనే విశ్లేషణలు మొదలయ్యాయి. .

అయితే ముందస్తు ఎన్నికలపై జగన్ సర్కార్ మొదటి నుంచి కూడా ఒకే విధంగా స్పందిస్తోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని చాలాసార్లు స్పష్టం చేశారు. అయినప్పటికి ముందస్తు ఎన్నికలపై అనుమానాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది. నేడు జరిగిన కేబినెట్ బేటీలో ముందస్తు ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు సి‌ఎం జగన్. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు కు వెళ్లబోమని షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తామని క్లారిటీ ఇచ్చారు.

Also Read:అల్సర్ ఉన్నవాళ్ళు.. అల్లంతో జాగ్రత్త !

ఎన్నికలకు 9 నెలకు మాత్రమే సమయం ఉనడంతో ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని, నేతలకు సూచించారు సి‌ఎం జగన్. దీంతో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు అనే సంగతి తేలిపోయింది. ఇక షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల టైమ్ లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి అధికారంలోకి రావాలని సి‌ఎం జగన్ గట్టిపట్టుదలగా ఉన్నారు. అటు జనసేన టీడీపీ పార్టీలు కూడా విజయం కోసం గట్టి ప్రయత్నలే చేస్తున్నాయి. మరి ఏపీలోని ఈ త్రిముఖ పోరులో ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి.

Also Read:పెళ్లి వద్దూ.. కానీ తల్లి కావాలా ?

- Advertisement -