Prabhas:చిరు మాటలు మర్చిపోలేను

32
- Advertisement -

ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. ప్రభాస్ రాముడిగా కృతి సనన్‌ సీతగా,సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా రామాయణం బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కింది ఈ చిత్రం. జూన్ 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చినజీయర్ స్వామి వచ్చారు.

ఈ సందర్భంగా అభిమానులనుద్దేశించి ప్రసంగించారు ప్రభాస్. జై శ్రీరామ్ అంటూ స్పీచ్ ప్రారంభించిన ప్రభాస్.. మీరు ఇచ్చిన నమ్మకమే మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకువచ్చింని తెలిపారు. మీరు ఇచ్చిన ఒక ధైర్యం మమ్మల్ని రాత్రి పగలు పోరాడి ఒక గొప్ప సినిమాని మీ ముందుకు తీసుకు వచ్చేలా చేసింది. ఆదిపురుష్ అనే సినిమాలో మేము నటించాం అనడం కంటే ఒక గొప్ప కథలో మేము భాగం అయ్యాము అనడమే కరెక్ట్ అన్నారు.

Also Read:CMKCR:వలసల కాలం పోయి పంటల కాలం వచ్చింది

ఓ సారి చిరంజీవి గారు నన్ను అడిగారు. ఏంటి రామాయణం కథలో నటిస్తున్నావా అని అడిగారు..అవునని చెప్పగానే ఆ కథలో నటించడం గొప్పవిషయం అని చెప్పారని గుర్తు చేశారు. ఈ సినిమా కోసం టీం అంతా బాగా కష్టపడ్డామని..ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మీ స్పందన చూశాక సంతృప్తినిచ్చిందన్నారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతోనే ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో అర్ధమయిందన్నారు.

Also Read:మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -