CMKCR:వలసల కాలం పోయి పంటల కాలం వచ్చింది

43
- Advertisement -

తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలసలకు బంద్‌ చెయడమే తమ ముందున్న ఏకైక లక్ష్యమని సీఎం కేసీఆర్ నాటి ఉద్యమ సమయంలో చేసిన వాగ్థానాన్ని గుర్తుచేసుకున్నారు. మంగళవారం నాగర్ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ…వలసల కాలం పోయి పంటల కాలం రావాలని కలలు కన్నట్టు తెలిపారు. అందుకే ఇక్కడ పంటల కొనుగోలు కేంద్రాలు ప్రత్యక్షం అయ్యాయని సీఎం అన్నారు. ఒకప్పుడూ ఎక్కడ చూసిన గంజి కేంద్రాలు ఉండేవి అవి ఇప్పుడు మాయం అయ్యాయని తెలిపారు. సాగు తాగునీటికి కరెంట్‌కు ఇబ్బందులు పడ్డామని అన్నారు. కానీ తెలంగాణ వచ్చాక వాటి గోసలు లేవన్నారు. పాలమూరు కష్టాలు తెలియాలంటే జయశంకర్ సార్ ఇక్కడ ఎంపీ పోటీ చేయమని సూచించిన సంగతి గుర్తు చేసుకున్నారు. అందుకే ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచి పాలమూరు కష్టాలు తెలుసుకున్నానని అన్నారు.

ఉద్యమ చరిత్రలో పాలమూరు పేరు శాశ్వతంగా ఉంటుందని గుర్తు చేశారు. ఈ జిల్లా ఎంపీగా ఉంటూనే ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించాను. ఈ జిల్లాను ఎప్ప‌టికీ మ‌రిచిపోను అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తొమ్మిదేండ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకొని భారతదేశంలోనే అగ్రభాగానా ఉన్నామని అన్నారు. అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిచామని దీనికి కారణం ప్రజల దీవెన అని తెలిపారు. తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్. కరెంటో వస్తదో రాదో తెలియని స్థితి నుంచి తలసరి విద్యుత్‌ వినియోగంలో మనమే నంబర్‌ వన్‌గా ఎదిగామని అన్నారు. సంక్షేమ రంగంలో కూడా రూ.50వేల కోట్లు ఖర్చు పెడుతూ ముందున్నాం అని కేసీఆర్ తెలిపారు.

ఒక్క మాట‌లో చెప్పాలంటే.. ఒక నాడు ముంబై బ‌స్సుల‌కు ఆల‌వాలం పాల‌మూరు. గంజి కేంద్రాలు వెలిసేవి. పాల‌మూరులో ఈ గంజి కేంద్రాలు ఏంట‌ని ఏడ్చేవాళ్లం. గంజి కేంద్రాల పాల‌మూరు జిల్లాలో అవి మాయ‌మ‌య్యాయి. పంట కొనుగోలు కేంద్రాలు వ‌చ్చేశాయి. తెలంగాణ‌లో బీఆర్ఎస్ పార్టీ సాధించిన విజ‌యం ఇది. కేసీఆర్ రాక‌ముందు ఇక్క‌డ్నుంచి మంత్రులు ఉన్నారు. కానీ మంచినీళ్లు కూడా ఇవ్వ‌లేదు. పాల‌మూరును ద‌త్త‌త‌ను తీసుకున్నారు. క‌నీసం మంచినీళ్లు ఇవ్వ‌లేక‌పోయారు. ఈ రోజు బ్ర‌హ్మాండంగా మిష‌న్ భ‌గీర‌థ ద్వారా కృష్ణా నీళ్లు దుంకుతున్నాయి. ఇక్కడికి ఐదు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు.

Also Read: నాగర్‌కర్నూల్‌కు సీఎం కేసీఆర్..

గృహలక్ష్మి కింద నియోజకవర్గానికి 3వేల ఇండ్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 4వేల ఇండ్లు మంజూరు చేస్తున్నాం. బీసీ కులాల్లో పేదలైన వారికి ఇది ఎంతో ఉపయోగం. అది ఈ నెల 9నుంచి ప్రారంభించబోతున్నాం. కులం లేదు జాతి లేదు. అందరూ మనవాళ్లే. అందరూ చల్లగా బతకాలి అని అన్నారు. ఇది రైతులు గిరిజనులు దళితుల ప్రభుత్వం అని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read: KTR:పారిశ్రామిక రంగంలో తెలంగాణ మేటీ

- Advertisement -