నేచురల్ స్టార్ నాని ల్యాండ్‌మార్క్ 30వ చిత్రం షూటింగ్ నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో శరవేగంగా సాగుతోంది. గోవాలో లాంగ్ షెడ్యూల్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు ముంబై షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసారు. కూనూర్‌లో సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం టీమ్ అంతా సిద్ధమయ్యారు.
మేకర్స్ విడుదల చేసిన ఒక చిన్న వీడియోలో నాని తన ముఖాన్ని హూడీతో కప్పుకుని సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్లు కనిపించారు. తర్వాత కూనూర్‌లో ఒక అందమైన లొకేషన్ కనిపించింది.
సీతా రామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో కథానాయిక. వైర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తుండగా, కోటి పరుచూరి సిఒఒగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ISC డీవోపీగా, హృదయం ఫేమ్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read: 14 రీల్స్ ప్లస్: #BSS10 గ్రాండ్‌గా ప్రారంభం
ప్రవీణ్ ఆంథోని ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా, సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. యూనిక్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read: మంచి థియేటర్ ఎక్స్ పీరియన్స్: గణేష్