రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రగతి భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ప్రగతి భవన్ అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్లలో జాతీయ జెండాను ఆవిష్కరించారు మంత్రి కేటీఆర్. సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్‌లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Also Read:డాండ్రఫ్ కి ఇలా గుడ్ బై చెప్పండి..!
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ .. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముర్ము తన ట్విట్టర్‌లో తెలంగాణ ప్రజలకు గ్రీటింగ్స్ తెలుపుతూ.. రాష్ట్రంలో అడువులు, వన్యప్రాణులు సుసంపన్నంగా ఉన్నట్లు తెలిపారు.
Also Read:గేట్స్ మెచ్చిన వెబ్‌సిరీస్..బోర్గెన్