June 1:చరిత్రలో ఈరోజు

40
- Advertisement -

చరిత్రలో ఈరోజుకు ఎంతో ప్రత్యేక స్ధానం ఉంది. అందుకే ఈ రోజు జరిగిన సంఘటనలు, సంగతులు, ప్రముఖుల పుట్టిన రోజు,మరణించిన రోజు గురించి తెలుసుకుందాం.

()ప్రపంచ పాల దినోత్సవం
()అంతర్జాతీయ బాలల దినోత్సవం
()1874: ఈస్టిండియా కంపెనీ రద్దు అమలులోకి వచ్చింది.
()1930: భారత్‌లో మొదటి డీలక్స్ రైలు (దక్కన్ క్వీన్) బొంబాయి – పూణే ల మధ్య ప్రారంభించబడింది.
()1955: అస్పృశ్యతను నేరంగా పరిగణించే చట్టం అమలులోకి వచ్చింది.
()1964: నయాపైసా, పైసాగా మార్చబడింది.
()1978: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు అర్జెంటీనాలో ప్రారంభమయ్యాయి.
()1979: విశాఖపట్నం జిల్లాలోని కొంత భాగం, శ్రీకాకుళం జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979, జూన్ 1న విజయనగరం జిల్లా అవతరించింది.
()1981: జనరల్ కె.వి. కృష్ణారావు భారత దేశము కు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
()1996: భారత ప్రధానమంత్రిగా దేవెగౌడ నియమితుడైనాడు.
()2001: నేపాల్ రాజప్రాసాదంలో రాజకుటుంబం హత్య

జననాలు

1891: శీరిపి ఆంజనేయులు, కవి, పత్రికా సంపాదకుడు. (మ.1974)
1926: మార్లిన్ మన్రో, హాలీవుడ్ నటి. ఖాళీ నిద్రమాత్రల సీసాతో, ఆమె పడకగదిలో శవమై పడి ఉంది. (మ.1962)
1940: ఎస్.ఎ.కె.దుర్గ, సంగీత విద్వాంసురాలు.
1944: జరుగుల వెంకట రామ భూపాలరావు వృక్ష శాస్త్రవేత్త.
1946: బాబు (చిత్రకారుడు), కొలను వెంకట దుర్గాప్రసాద్, తెలుగులో మంచి వ్యంగ్య చిత్రకారులలో ఒకడు. “బాబు” అన్నది అతని కలం (కుంచె) పేరు
1950 : కలిదిండి బి.ఆర్. వర్మ, భారతీయ భౌతికశాస్త్రవేత్త.
1952: సబ్బం హరి, రాజకీయనాయకుడు
1953: బలరామయ్య గుమ్మళ్ళ, మాజీ కలెక్టర్, వివిధ శాఖలలో పనిచేశారు. ఈయన నటుడు కూడా.
1958: గుమ్మా సాంబశివరావు, ఆధునిక తెలుగు కవి.
1964: ఎస్. వి. కృష్ణారెడ్డి, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకత్వంతో బాటు కథారచన, సంగీత దర్శకత్వం, విభిన్న కళలలో ప్రవేశం ఉన్న వ్యక్తి.
1974: ఆకెళ్ళ రాఘవేంద్ర, రచయిత, పాత్రికేయుడు, ఐఏయస్ శిక్షకుడు.
1975: కరణం మల్లేశ్వరి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి.

మరణాలు

1868: జేమ్స్ బుకానన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1791)
1961: మెల్విన్ జోన్స్, లయన్స్ క్లబ్ వ్యవస్థ స్థాపకుడు (జ.1879).
1968: హెలెన్ కెల్లర్,అంధులకు, బధిరులకు, మూగవారికి వారధిగా, వికలాంగుల ఉద్యమాల సారథి (జ.1880).
1996: నీలం సంజీవరెడ్డి, భారత రాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, లోక్‌సభ సభాపతి (జ.1913).
2001: బీరేంద్ర, నేపాల్ రాజు (జ.1972).

- Advertisement -