దారులన్నీ వరంగల్‌వైపే..

190
Warangal painted pink ahead of TRS meeting
Warangal painted pink ahead of TRS meeting
- Advertisement -

వరంగల్లోని ప్రకాశ్‌రెడ్డిపేటలో టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదిన సభకు యావత్తు తెలంగాణ సిద్ధమైంది. దేశ చరిత్రలోనే తొలిసారి 275 ఎకరాల్లో… 8,400 చదరపు అడుగుల్లో భారీ వేదిక నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా 15లక్షల మంది ఈ సభకు వస్తారని ముందుగా అంచనా వేసినా.. అంతకుమించి ప్రజలు తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. మహిళలకే ముందు వరుసలో గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్, ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు, మహిళలు, పురుషులకు తొలిసారిగా ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. వీవీఐపీ, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలతో పాటు.. మీడియా గ్యాలరీలో 400 మందికి సీటింగ్ అరేంజ్ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సభా ప్రాంగణంలో చల్లదనం కోసం స్ప్రింక్లర్‌ లను ఏర్పాటు చేశారు. ఇక సభా ప్రాంగణంలో గంటన్నర పాటు క్రాకర్స్ కాలుస్తారు. సభా స్థ‌లి బాడ‌ర్ ను సూచించేలా 2 వేల జెండాలను 25 ఫీట్ల ఎత్తుతో ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం 2, 400 చదరపు అడుగుల్లో కళాకారుల వేదిక నిర్మించారు. 300 మంది కళాకారులు, కళాజాతలతో కూడిన రసమయి బృందం ఆటాపాటల తో హోరెత్తించనుంది.

 Tractor

ప్రగతి నివేదన సభాప్రాంగణానికి చేరుకోవడానికి మండే ఎండలను సైతం లెక్కచేయకుండా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వందలు… వేలు… లక్షలుగా జనం తరలివెళ్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలనుంచి సైకిల్, బైక్ ర్యాలీలు ప్రారంభమయ్యాయి. పలుజిల్లాల నుంచి ఎడ్లబండ్లు బారులుగా బహిరంగసభకు తరలాయి. టీఆర్‌ఎస్ సభ వల్ల తెలంగాణవ్యాప్తంగా మరోసారి ఉద్యమకాలంనాటి ఉద్వేగ వాతావరణం ఆవిష్కృతమవుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా టీఆర్‌ఎస్ ఎప్పుడు బహిరంగ సభ నిర్వహించినా లక్షలాది జనం వారం, పదిరోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకునేవారు. అప్పుడు తెలంగాణ సాధించడం లక్ష్యంకాగా, ఇప్పుడు సాధించిన రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుకోవడం కోసం యావత్తు రాష్ట్రం సన్నద్ధమైంది.

harish

హైదరాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, ఖమ్మం నుంచి ట్రాక్టర్లపై తరలివచ్చేవారికి వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసున్నాయి. వివిధ జిల్లాల పార్కింగ్ ప్రదేశాలను ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి చూసుకుని వెళ్లారు. మంత్రి హరీశ్‌రావు నాలుగైదు రోజులుగా ఇక్కడే మకాం వేసి సభాఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర టీఆర్‌ఎస్‌కు ఉన్నది. గత రికార్డులన్నీ బద్ధలయ్యేలా ప్రస్తుత బహిరంగసభను చారిత్రాత్మకంగా నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.

- Advertisement -