‘గర్భాసనం’ యొక్క లాభాలు..!

76
- Advertisement -

కూర్చొని వేయు ఆసనాలలో గర్భసనం కూడా ఒకటి. ఈ భంగిమ గర్భంలో ఉండే శిశువును పోలి ఉంటుంది. అందుకే దీనికి గర్భసనం అని పేరు. ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం ద్వారా పలు ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా పిరుదుల భాగంలోనూ, తొడల భాగంలోనూ పెరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో వ్యాసనం చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ఆసనం ప్రతిరోజు వేయడం వల్ల మలబద్ధకం సమస్య దూరం అవుతుంది. అలాగే వెన్నుపాము ఫ్లెక్సిబిలిటీ జరుగుతుంది. నడుము నొప్పి సమస్య కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా హెర్నియా వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనం ఎంతో ప్రయోజనం. హెర్నియా వల్ల కలిగే సమస్యలను ఈ ఆసనం తగ్గిస్తుంది. అలాగే ముత్రేంద్రియ వ్యాధులు, స్త్రీల ఋతుస్రావ వ్యాధులు కూడా ఈ ఆసనం ప్రతిరోజూ వేయడం వల్ల తగ్గిపోతాయి.

​గర్భాసనం వేయు విధానం
ముందుగా యోగా షీట్ వేసుకొని చదునైన నేలపై పద్మాసనంలో కూర్చోవాలి. కొంత సమయం తరువాత మనసు ప్రశాంతంగా ఉంచుకొని పద్మాసనం నుంచి కుక్కుటసనంలోకి మారాలి. ఆ తరువాత పిరుదుల భాగాన్ని నేలకు ఆనించి రెండు కాళ్ళ మద్య రెండు చేతులను బయటకు తెచ్చి పోటోలో చూపిన విధంగా చేతులతో తలను పట్టి ఉంచాలి. ఇలా ఈ భంగిమలో వీలైనంత సమయం ఉన్న తరువాత యథాస్థితికి రావాలి.

Also Read:TTD:శ్రీ రామచంద్రమూర్తి చిద్విలాసం

​గమనిక
​నడుము నొప్పి అధికంగా ఉన్నవాళ్ళు, కడుపు భాగంలో సర్జరీ చేయించుకున్న వారు.. యోగా నిపుణుల పర్యవేక్షణలో ఈ ఆసనం వేయాల్సివుంటుంది.

- Advertisement -