నేటిరోజుల్లో చాలా మంది ఎదుర్కొనే ప్రధానమైన ఆరోగ్య సమస్య షుగర్ వ్యాధి. మారుతున్న జీవన శైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా డయాబెటిస్ బారిన పడుతున్నారు చాలా మంది. ఒక్కసారి డయాబెటిస్ బారిన పడితే దాని నుంచి పూర్తిగా కోలుకోవడం చాలా కష్టం. డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకునేందుకు ఎన్నో రకాల మెడిసన్స్ తీసుకున్నప్పటికి సరైన ఫలితాలు మాత్రం కనిపించవు. అందుకే మధుమేహ వ్యాధి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇక చక్కెర వ్యాధిని అదుపు చేయడానికి మెడిసన్స్ కంటే కూడా మనం తినే ఆహారం విషయంలో ఎక్కువ జాగ్రతలు తీసుకుంటే త్వరగా కంట్రోల్ చేయవచ్చని పలు అధ్యాయనాలు చెబుతున్నాయి. .
షుగర్ వ్యాధిని అదుపు చేయడంలో నేరేడు పండును ప్రధానంగా చెప్పుకోవచ్చు. నేరేడు పండులో వుండే వివిధ రకాల సమ్మేళనలు చక్కెర వ్యాధిని అదుపు చేస్తాయి. అందువల్ల జూన్ జులై మసాల్లో లభించే నేరేడు పండును షుగర్ పేషెంట్స్ తప్పనిసరిగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇక షుగర్ వ్యాధిని ఆదుపు చేయడంలో చేపలు కూడా ముఖ్యమైనవి. సాల్మాన్, ట్యూనా, హెర్రింగ్, వంటి చేపల్లో ఒమేగా 3 యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది షుగర్ వ్యాధిని వేగంగా నియంత్రణలోకి తెస్తుంది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఆహారపు డైట్ లో చేపలు ఉండేలా చూసుకోవాలి.
Also Read: ఆ హీరోయిన్ విడాకులు.. నిజమే
ఇక మధుమేహాన్ని తగ్గించడంలో నల్ల గోదుమలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బ్రౌన్ గోదుమలతో పోల్చితే ధర ఎక్కువగా ఉండే నల్ల గోదుమలు.. షుగర్ ను ఆదుపు చేసే గుణాలను కల్గి ఉన్నాయి. ఇందులో ఉండే ఫైబర్, అమినో యాసిడ్స్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం వంటివి చక్కెర వ్యాధిని అదుపు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ నల్ల గోదుమలతో చేసిన రొట్టెలు ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఓట్స్, పప్పుదినుసులు, ఆకుకూరలు, ఎక్కువగా తినాలని అలాగే షుగర్ పేషెంట్స్ ప్రతిరోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నా మాట. ఇవన్నీ తప్పనిసరిగా పాటిస్తూ ఆహార డైట్ విషయంలో కచ్చితత్వాన్ని కలిగి ఉంటే షుగర్ వ్యాధి నుంచి వేగంగా విముక్తి పొందవచ్చు.
Also Read: సగ్గుబియ్యంతో ఆ సమస్యలు దూరం..!