SURIYA:నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు

85
- Advertisement -

మే 6న టెక్సాస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో ఐశ్వర్య తాటికొండ అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య మృతితో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సినీ నటుడు సూర్య తన అభిమాని అయిన ఐశ్వర్య మృతికి భావోద్వేగానికి గురయ్యారు. ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఐశ్వర్య చిత్రపటం వద్ద పూలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ఐశ్వర్య కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ లేఖను రాశారు.

మీ కుటుంబాన్ని ఎలా ఓదార్చాలో నాకు మాటలు రావడం లేదు. ఐశ్వర్య మృతి తీరని లోటు. టెక్సాస్‌లో జరిగిన ఉదంతంలో మీ కుమార్తె మరణించడం దురదృష్టకరం. ఆమె ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచే ఉంటుంది. ఒక ధ్రవతార వెలుగుతూనే ఉంటుంది. అలాగే నీ మృతికి నివాళిగా రాస్తున్న అక్షరాలు కావు. నువ్వు నిజమైన హీరోవి. నీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు నువ్వొక ధ్రువతారవు. నువ్వు చిందించే చిరునవ్వు. నీలో ఉన్న ప్రేమను పంచే వ్యక్తిత్వం ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతుందని అన్నారు.

Also Read: జూ. ఎన్టీఆర్ రియల్ హీరో కూడా

- Advertisement -