సినిమా హీరోయిన్ గా రాణించాలి అంటే.. అందం, అభినయంతో పాటు ఎన్నో ఉండాలి. అలాగే ఒక్కోసారి కెరీర్ కోసం జీవితాన్ని కూడా త్యాగం చేయాల్సి వస్తోంది. ఇష్టం లేకపోయినా గుర్తింపు కోసం కొన్ని పాత్రలు కూడా నటించాల్సి వస్తోంది. హీరోయిన్ విద్యా బాలన్ తాను అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను అని ఇప్పటికే ఆమె పలుమార్లు చెప్పుకొచ్చారు. తాజాగా తన కెరీర్ బిగినింగ్ లో జరిగిన పలు ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది.
ఆ ముచ్చట్లు ఏమిటో విద్యా బాలన్ మాటల్లోనే విందాం. ‘అసలు అప్పట్లో నాకు సినిమాల్లోకి రావాలనే ఆలోచనే ఉండేది కాదు. అదేంటి ?, విద్యా బాలన్ ఇలా చెబుతుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది నిజం. నేనెప్పుడు నటిని కావాలని ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు నేను చెప్పేది మీరు నమ్ముతారో లేదో.. కానీ నిజం. మొదట్లో నేను జాబ్ కూడా చేశాను. ఆ సమయంలో నేను హోటల్ బిజినెస్ చేయాలనుకున్నాను. అందుకే కొన్నాళ్ళు ఓ హోటల్ లో పనిచేశాను కూడా’ అని విద్యా బాలన్ చెప్పింది.
Also Read: ఆదిపురుష్ చూశాక ఆశ్చర్యపోతారు:శరద్
విద్యా బాలన్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఆ హోటల్ లో పార్టీలు ఎక్కువగా జరిగేవి. ఆ పార్టీల్లో చాలామంది విపరీతంగా తాగేవారు. ఆ సమయంలో నేను వెళ్లి వాళ్ళ పక్కన కూర్చోవాల్సి వచ్చేది. నిజానికి అప్పటి విద్యా బాలన్ వేరు. ఆమెకు భయం ఎక్కువ. ఎవరేం చేసినా ఆ విద్యా బాలన్ నోరు కూడా ఎత్తేది కాదు. ఎంత కష్టం అయినా, ఎవరిని ఇబ్బంది పెట్టేది కాదు. అలా ఎన్నో కష్టాలు పడి నటిగా ఎదిగాను అంటూ విద్యా బాలన్ తెలిపింది.
Also Read: పిక్ టాక్ : కుర్ర హృదయాల పై ఘాటు ముద్ర