‘పదహస్తసనం’తో ఆ సమస్యలు దూరం!

57
- Advertisement -

ప్రతిరోజూ తప్పనిసరిగా వేయవలసిన ఆసనాలలో ” పదహస్తసనం ” కూడా ఒకటి. ఈ ఆసనాన్ని వేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనలు కలుగుతాయి. ముఖ్యంగా కాలి కండరాలు దృఢంగా తయారవుతాయి. పొత్తి కడుపులో ఎలాంటి సమస్యలు ఉన్న ఈ ఆసనం వేయడం ద్వారా దూరమౌతాయి. అలాగే జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.

మలబద్దక సమస్యను దూరం చేస్తుంది.ఉదర కండరాలను బలపరచడంతో పాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగిస్తుంది. అలాగే వెన్నెముక సమస్యలను దూరం చేస్తుంది.

వెన్నెముక నుంచి మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేయడంతో పాటు ఏకాగ్రతను పెంచుతుంది. ఇలా ఎన్నో రకాల ఉపయోగాలు “పదహస్తసనం ” ద్వారా లభిస్తాయి. ఈ ఆసనం వేయడం కూడా ఎంతో సులభం కావడంతో ప్రతిరోజూ తప్పనిసరిగా ఈ ఆసనం వేయాలని యోగా నిపుణులు చెబుతున్నారు.

పదహస్తసనం వేయు విధానం

ముందుగా నిటారుగా నిలబడి రెండు కాళ్ళను వీలైనంతా వెడల్పు చాపలి. రెండు కాళ్ళ మద్య దూరం కనీసం 3-4 అడుగులు ఉండవలెను. ఊపిరి బాగా పిల్చుకొని,వెన్నెముక ను నిటారుగా ఉంచుతూ తుంటి భాగం నుంచి ముందుకు వంగాలి. భుజాలను సమాంతరంగా ఉంచుతూ తలను నెలకు ఆనించి రెండు చేతులను ఫోటోలో చూపిన విధంగా రెండు కాళ్ళ పాదాలకు ఆనించాలి. తరువాత ఊపిరి బాగా పీల్చుకొని రెండు చేతులను ముందుకు చాచుతూ నెమ్మదిగా తుంటి భాగాన్ని పైకి లేపాలి. ఇలా కనీసం 10-15 సార్లు రిపిటేషన్ చేయాలి.

Also Read:పాదోతానాసనంతో ఆ సమస్యలు దూరం!

గమనిక
నడుం నొప్పి, తలనొప్పి అధికంగా ఉన్నవాళ్ళు ఈ ఆసనం వేయరాదు.

- Advertisement -