తెలంగాణలో కాంగ్రెస్ భయం అదే !

51
- Advertisement -

కర్నాటక ఎన్నికల విజయంతో రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్ తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో కూడా సత్తా చాటాలని హస్తం హైకమాండ్ భావిస్తోంది. అయితే గెలవడం సంగతి అలా ఉంచితే.. రాష్ట్రం ఏదైనా హస్తం పార్టీలో నెలకొనే అనిశ్చితి కమాన్ సమస్యగా మారింది. వర్గపోరు, ఆధిపత్య విభేదాలకు పెట్టింది పేరని హస్తం పార్టీ పై ఓ విమర్శ మొదటి నుంచి ఉంది. అయితే ఈ విమర్శను ఎప్పటికప్పుడు నిజం చేస్తూనే ఉంది ఆ పార్టీ. గతంలో జాతీయ అధ్యక్షుడి విషయంలో నేతల మధ్య రగడ, ఆయా రాష్ట్రాలలో స్థానిక నేతల మధ్య సమన్వయలోపం.. ఇలా కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే తయారవుతుంది. .

ఊహించని రీతిలో కర్నాటకలో విజయం సాధించినప్పటికి.. సి‌ఎం ఎవరనేది తేల్చలేకపోవడం ఆ పార్టీలోని సమన్వయలోపానికి అద్దం పడుతోంది. ఇదే సమస్య గతంలో రాజస్తాన్ రాష్ట్రంలో కూడా ఎదుర్కొంది హస్తం పార్టీ. అక్కడ కూడా అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్ మధ్య కూడా సి‌ఎం పదవి విషయంలో ఇదే రగడ జరిగింది. ఇప్పుడు కర్నాటకలో కూడా సిద్దరామయ్య మరియు డీకే శివకుమార్ మధ్య “నేనే సి‌ఎం ” రగడ కొనసాగుతోంది. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ..

తెలంగాణలో కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో పలువురు నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నప్పటికి, తాము కూడా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉన్నామని సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటివారు చెప్పకనే చెబుతున్నారు. అందువల్ల పార్టీ అధిష్టానం ముందుగానే సి‌ఎం అభ్యర్థిని ప్రకటించక పోతే తెలంగాణలో కూడా ఇదే రకమైన సమస్యను అధిష్టానం ఫేస్ చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి గత రాష్ట్రాల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో సి‌ఎం అభ్యర్థిని అధిష్టానం ముందే ప్రకటిస్తుందా లేదా అనేది చూడాలి.

Also Read: సిద్దరామయ్య వైపే మొగ్గు.. డీకేను దెబ్బతీసిందదే!

- Advertisement -