కార్ డ్రైవర్ తో ఎఫైర్.. దారుణం

57
- Advertisement -

నరేష్, పవిత్ర లేటు వయసులో ప్రేమలో పడ్డారు. తమ కుటుంబాల పరువును బజారున పడేశారు. ఇంకా సరిపోలేదు అని ఇద్దరూ ప్రధాన పాత్రల్లో ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమా చేశారు. సినిమాలో మెయిన్ కంటెంట్.. వీరి ప్రేమ బాగోతమే. అలాగే నరేష్ మూడో భార్య రమ్యను విలన్ గా చూపించబోతున్నారు. ఆమె తమ కార్ డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందని.. రోడ్ పైనే కార్ లో అతనితో ఆమె శృంగారం చేసేది అని ఈ సినిమాలో నరేష్ చూపించబోతున్నాడు. నిజంగా ఇది చాలా దారుణమైన విషయం.

నరేష్ ఒక ఆడదాని పరువును బజారున పడేయడం క్షమించరాని తప్పు. సరే, నరేష్ చెబుతున్నట్లు రమ్య కార్ డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుందో లేదో తెలియదు. పైగా ఆమె ఎన్నడూ తన పరిధి దాటి నరేష్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు. కానీ నరేష్ మాత్రం ఇష్టం వచ్చినట్లు ఆమె పై దారుణమైన కామెంట్స్ చేశాడు. పైగా ప్రత్యేకంగా సినిమా కూడా తీస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నరేష్, పవిత్ర కలిసి ఇంటర్వ్యూ లు కూడా ఇస్తున్నారు.

Also Read: వివాదాస్పద కథే హిట్ సూత్రం

ఈ క్రమంలో ఓ టీవీ షోలో కూడా పాల్గొన్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. మీ రిలేషన్‌షిప్ స్టేటస్ ఏంటని యాంకర్ అడగగా.. నరేష్ బదులిస్తూ ‘ఆకాశం మీదపడినా, భూమి బద్దలైనా మేము కలిసే ఉంటాం’ అని బదులిచ్చారు. అనంతరం నరేష్, పవిత్ర ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు. మరి మధ్యలో రమ్య ఏం చేసింది?. కార్ డ్రైవర్ తో లింక్ పెట్టి ఆమెను ఎందుకు బాధ పెట్టడం.!? నరేష్ గారు కాస్త ఆలోచించండి.

Also Read: శ్రీలీల..అందాల నిధి

- Advertisement -