‘ది కేరళ స్టోరీ’ విడుదలపై దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. ఈ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వారం రోజుల క్రితం జరల్నిస్ట్ కుర్బన్ అలీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌పై తక్షణ విచారణ అవసరమని అలీ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కూడా అడ్డంకి ఎదురైన సంగతి తెలిసిందే.
“ది కేరళ స్టోరీ” సినిమాకి తెలంగాణలోని భైంసాలో అడ్డంకులు ఎదురయ్యాయి. ఈ సినిమా ప్రదర్శనను పోలీసులు నిలిపి వేశారు. తాజాగా ఈ సినిమాపై కొన్ని ఆంక్షలు సడలించారు. ఈ సినిమాను కేవలం మార్నింగ్, మాట్నీ రెండు షోలకు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు. దీంతో ఈ రోజు ఉదయం 11 నుంచి సినిమా ప్రదర్శన ప్రారంభం కానుంది. మొత్తానికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా చిన్న సినిమాలకు సరికొత్త మార్గం చూపించింది.
Also Read:మాంసాహారం తిన్న తరువాత ఇలా అస్సలు చేయకండి!
చిన్న బడ్జెట్ సినిమాలు ఏదోక సీరియస్ అంశం పై గనుక వస్తే.. కచ్చితంగా ఆ సినిమాల పై కూడా పెద్ద ఎత్తున చర్చ ఉంటుందని, “ది కేరళ స్టోరీ” సినిమా రుజువు చేసింది. నిజానికి ఈ సినిమాలో స్టార్ట్ నటీనటులు కూడా ఎవరూ లేరు. అయినా, ప్రేక్షకులు ఈ సినిమా పై ఆసక్తి చూపిస్తున్నారు అంటే.. దానికి ముఖ్య కారణం మాత్రం.. ఈ సినిమాలో వివాదాస్పద కథే. మొత్తమ్మీద చిన్న చిత్రాలకు వివాదాస్పద కథే హిట్ సూత్రం అని ఈ సినిమా నిదర్శనంగా నిలిచింది.
Also Read:Horse gram:వామ్మో.. ఉలవలతో ఎన్ని ప్రయోజనాలో!