ఓటీటీ & థియేటర్స్ లో ఈ వారం !

66
- Advertisement -

ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ లో రెండు భారీ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే ఓటీటీల జోరు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక ప్రేక్షకులు కూడా ప్రతి వారం థియేటర్స్ అండ్ ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ క్రమంలో ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్స్ అండ్ ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలివే..!

‘అన్నీ మంచి శకునములే’ :

నందినిరెడ్డి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్‌, మాళవిక నాయర్‌ జంటగా రూపొందిన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. ఈ చిత్రం మే 18న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

‘బిచ్చగాడు’ :

హీరో విజయ్‌ ఆంటోని ‘బిచ్చగాడు’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న సినిమా ‘బిచ్చగాడు-2’. కావ్య థాపర్‌ కథానాయిక. ఈ సినిమా మే 19న థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఓటీటీ కంటెంట్ విషయానికి వస్తే..

నెట్‌ఫ్లిక్స్‌ లో ప్రసారాలు ఇవే :

అయాలవాషి (మలయాళం)మే 19వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

కథల్‌ (హిందీ) మే 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

బయీ అజైబి (ఇంగ్లీష్‌) మే 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

మ్యూటెడ్‌ (ఇంగ్లీష్‌) మే 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

నామ్‌ (సీజన్‌-2) మే 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

సోనీ లివ్‌ లో ప్రసారాలు ఇవే :

కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) మే 19 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అఖిల్‌ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’. ఇప్పుడు సోనీలివ్‌ వేదికగా మే 19వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్‌’ లో ప్రసారాలు ఇవే :

వివాహానంతరం నిహారిక కొణిదెల ‘డెడ్‌ పిక్సెల్స్‌’ వెబ్‌ సిరీస్‌తో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ లో ఈ నెల 19వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో ప్రసారాలు ఇవే :

మోడ్రన్‌ లవ్‌ చెన్నై (తమిళ్‌) మే 18వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.

- Advertisement -