కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ?

63
- Advertisement -

కర్నాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్ కు భయం పట్టుకుందా ? బీజేపీ కుయుక్తులు కాంగ్రెస్ ను దెబ్బ తీయబోతున్నాయా ? బీజేపీ ఎత్తుగడలు కాంగ్రెస్ కునుకు లేకుండా చేస్తున్నాయా ? అనే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన ఫలితాలను బట్టి చూస్తే హంగ్ ఏర్పడడానికే ఎక్కువ ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక పార్టీలోని ఎమ్మేల్యేలు మరో పార్టీ వైపు చూడకుండా జాగ్రత్తలు తీసుకోవడమే మెయిన్ టాస్క్ అయింది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలోనూ ఏర్పడిన ప్రభుత్వాలను కూల్చడంలోనూ బిజెపికి వెన్నతో పెట్టిన విద్య.

Also Read: రచ్చ లేపుతున్న మహారాష్ట్ర రాజకీయం !

ఆయా రాష్ట్రాలలో ఇదే రకమైన ప్రణాళికలతో బీజేపీ అధికారం చేజిక్కించుకున్న ఉదాహరణలు కోకొల్లలు. ప్రస్తుతం కాంగ్రెస్ ను భయపెడుతున్న అంశం ఇదే. బీజేపీ కంటే కాంగ్రెస్ కే అధిక సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ పన్నాగలను ముందుగానే ఊహిస్తున్న హస్తం పార్టీ అధిష్టానం.. ఎమ్మేల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు అన్నీ రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యే క్యాండేట్లను అందరినీ ఒక్క చోట చేర్చి వారికి ఇప్పటికే కీలక సూచనలు ఇస్తోందట కాంగ్రెస్ అధిష్టానం. మరోవైపు హంగ్ ఏర్పడే అవకాశం ఉండడంతో వాట్ నెక్స్ట్ అనే దానిపై కూడా కాంగ్రెస్‌ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. హంగ్ ఏర్పడితే జెడిఎస్ తో కలవడం తప్పా వేరే ఆప్షన్ లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మేల్యేలు ఏ మాత్రం చేజారిన బీజేపీ అధికారం చేపట్టడం అనివార్యం అవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నీ కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి హస్తం పార్టీ ఏం చేయబోతుందో చూడాలి.

Also Read: హంగ్ వస్తే.. జేడీఎస్ ప్లాన్ అదే !

- Advertisement -