ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ముస్కాన్ నారంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోని షేర్ చేసింది ముస్కాన్. ఇదే తన చివరి వీడియో..ఇకపై నేను మీకు కనిపించను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ని కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నించాను. కానీ రివర్స్‌లో వాళ్లే నన్ను కన్విన్స్ చేసేందుకు చూశారు. నేను చేసే దాంట్లో ఎవరి ప్రమేయం లేదు. దయచేసి ఎవరిని నిందించకండి అంటూ వీడియోలో తెలిపింది.
ఇటీవలె ముంబై నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లారు ముస్కాన్. కుటుంబ సభ్యలుతో కలిపి సరదాగా గడిపారు. ఆ తర్వాతి రోజు ఇంటి పైనున్న స్టోర్ రూమ్‌కి వెళ్లి చూడగా ముస్కాన్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దీంతో ఆమెకు కిందికి దింపి ఆసుపత్రికి తీసుకెళ్లినా అప్పటికే ముస్కాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read:ముక్కు నుంచి రక్తం వస్తోందా.. జాగ్రత్త !