కుర్ర హీరోలతో చేస్తోందట

58
- Advertisement -

హోమ్లీ బ్యూటీగా మీనా నేటికీ సౌత్ లో మంచి డిమాండ్ ఉంది. పైగా ప్రస్తుతం నటిగా ఆమె ఫుల్ బిజీగా ఉంది. తెలుగు తమిళ మరియు మలయాళంలో ఆమె వరుసగా సినిమాలు చేస్తోంది. ఐతే, మీనా ఇప్పుడు హీరోయిన్ వేషాలు వెయ్యడం లేదు. అక్క, వదిన వంటి పాత్రలు చేస్తున్నారు. కానీ, మీనాతో హీరోగా నటించిన వాళ్ళు ఇంకా హీరోగానే నటిస్తున్నారు. అంతే కాదు, వాళ్ళు తమ కన్నా 20 ఏళ్ళు చిన్నవారితో సినిమాల్లో రొమాన్స్ చేస్తున్నారు. కాబట్టి, తాను అలాగే చేస్తాను అంటుంది ఈ సీనియర్ బ్యూటీ.

మీనాకి కూడా కుర్ర హీరోలలో నటించాలని ఉందట. ఇదే విషయాన్ని మీనా తన సన్నిహితుల దగ్గర ప్రస్తావిస్తూ “నేను కూడా యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోలతో ఎందుకు రొమాన్స్ చెయ్యకూడదు. వారితో నేను జతకడితే తప్పేంటి. ఇప్పుడు పెద్ద హీరోలందరూ తమ కన్నా 20, 25 ఏళ్ల చిన్నవారితో డ్యూయెట్లు పాడుతున్నారు కదా. మరి సీనియర్ హీరోయిన్లు యంగ్ హీరోలతో నటిస్తే తప్పేంటి ? అని మీనా మాట్లాడుతుంది. నిజానికి తప్పు ఏమి లేదు. కాకపోతే, మీనా వయసు ఇప్పుడు 46 ఏళ్ళు.

Also Read: బిచ్చగాడు-2 ట్రైలర్ విడుదల..!

46 ఏళ్ల వయసులో బికినీ వేసుకుని కుర్ర హీరోలతో సెక్సీ స్టెప్ లు వేస్తేనే చూడటానికి అంతగా బాగుండకపోవచ్చు. కానీ, సీనియర్ హీరోయిన్లు కూడా కుర్ర హీరోయిన్లలా పర్ఫెక్ట్ గా ఫిజిక్ ను మెయింటైన్ చేసి హీరోయిన్ గా నటిస్తే బాగానే ఉంటుంది. మరి అలా చేసే సీనియర్ హీరోయిన్లు ఎవరు ఉంటారు. మధుబాల ఇప్పటికీ అలాంటి రోల్స్ చేస్తోంది అనుకోండి.

Also Read: పిక్ టాక్ : ఉబికి వచ్చే పరువాలతో రచ్చ

- Advertisement -