KTR:పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ

45
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం సాధించుకన్న తర్వాత నుంచి పెద్ద ఎత్తున్న అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్‌. హైదరాబాద్‌ హెచ్‌ఐఐసీలో ఏర్పాటు చేసిన ఫుడ్‌ కాంక్లేవ్-2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ అభివృద్ధికి ఐదు రెవల్యూషన్స్ తీసుకువచ్చామని తెలిపారు. తెలంగాణ సీడ్‌ బాల్‌ ఆఫ్ ఇండియాగా ఎదిగిందన్నారు. అలాగే మత్య్స సంపదలో కూడా తెలంగాణ దేశంలో నెంబర్‌వన్‌గా నిలిచిందని తెలిపారు. హార్టికల్చర్ డైరీ రంగాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున్న ప్రొత్సహిస్తున్నామని అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం, వెటర్నరీ వర్సిటీ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణ ఫౌల్ట్రీ క్యాపిటల్‌ ఆఫ్ ఇండియాగా ఉందని అన్నారు.

తెలంగాణ తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ పాలసీ టీఎస్ ఐపాస్ పనితీరు చాలా బాగుందని, రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నేరుగా ఎవరిని కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేస్తే 15 రోజుల్లోనే కంపెనీ ఏర్పాటుకు అనుమతులు వస్తాయని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగం యూనిట్లు ఏర్పాటు చేస్తే అందుకు కావాల్సిన ముడిపదార్థాలను గ్రామీణ ప్రాంతాల నుంచి అందించేందుకు అధికారులు సహకారం అందిస్తారని చెప్పారు.

దళితబంధు పథకం కింద ఇస్తున్న రూ.10 లక్షలతో నలుగురు కలిసి 40 లక్షలతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. చిన్న మధ్యతరగతి పారిశ్రామికవేత్తలను ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు. తెలంగాణలో ఉత్తర, దక్షిణ భారతదేశానికి చెందిన ప్రజలు పనిచేస్తున్నారని తెలిపారు. దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. టెక్స్‎టైల్ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కావలసిన ముడి పదార్థాలు రాష్ట్రం నుంచి లభిస్తాయన్నారు. విజయ డైరీ కూడా లాభాల బాటలో కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Also Read: సచివాలయ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!

తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సాగుకు కావాల్సిన విద్యుత్‌ను 24 గంటలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పెద్దఎత్తున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు.

Also Read: వారంలో ఇళ్ల పట్టాల పంపిణీ…

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో వ్యవసాయం, డెయిరీ రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. విజయ డెయిరీ ద్వారా అనేక ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చామని చెప్పారు. పౌల్ట్రీరంగాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.

- Advertisement -