బీజేపీ పార్టీలోకి మరోసారి జాయిన్ అయ్యే అవకాశం లేదని సినీ నటుడు సుమన్ అన్నారు. ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. సినీ పరిశ్రమలో నేను 45సంవత్సరాలు పూర్తైన సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నట్టు తెలిపారు. సినిమా సెకండ్ ఇన్నింగ్స్లో భాగంగా పలు భాషాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. అలాగే రాజకీయా ప్రవేశం గురించి మాట్లాడుతూ…నేను గతంలో బీజేపీలో జాయిన్ అయ్యాను. మళ్లీ కొన్ని అనివార్య కారణాల వల్ల బయటికి వచ్చాను. తిరిగి వెళ్లే అవకాశం లేదని స్పష్టతనిచ్చారు.
Also Read: బిచ్చగాడు-2 ట్రైలర్ విడుదల..!
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు మద్ధతు పలికిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా దేశరాజకీయాల వైపు వెళ్లుతున్న బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు ఇస్తున్నట్టుగా తెలిపారు. పూర్తి స్థాయిలో తెలంగాణ అభివృద్ధి కావాలంటే మరో ఐదు సంవత్సరాల కాలం కావాలని అది సీఎం కేసీఆర్ నాయకత్వంలో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read: కర్ణాటకలో మాటల వార్..!