సచివాలయ ప్రారంభ వేడుకలు..షెడ్యూల్‌ ఇదే..!

61
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ సచివాలయం రేపు సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా రేపు జరగబోయే ప్రారంభ వేడుకల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 30న సూర్యోదయం ఉదయం 6గంటల తర్వాత సచివాలయంలో సుదర్శనయాగం, చండీయాగం వాస్తుయాగంతో ప్రారంభం కానున్నట్టు తెలిపింది. మధ్యాహ్నం 1గంట 20నిమిషాల నుంచి 1గంట 30నిమిషాల మధ్య పూర్ణాహూతి యాగం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తరువాత సమీకృత కొత్త సచివాలయంను సీఎం కేసీఆర్ చేతులమీదుగా రిబ్బన్ కట్‌ చేయనున్నారు. ఆ వెంటనే ఆరవ అంతస్తులోని తన ఛాంబర్లో సీఎం కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు.

Also Read: హైదరాబాద్‌..రేపు ట్రాఫిక్ ఆంక్షలు

మధ్యాహ్నం 1గంట 58నిమిషాల నుంచి 2గంటల 04నిమిషాల మధ్యకాలంలో సీఎం కేసీఆర్‌తో పాటుగా మిగిలిన శాఖ మంత్రులు కూడా కొలువుదీరనున్నారు. అనంతరం సచివాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. అనంతరం సభ తర్వాత తమ తమ స్థానాల్లో అధికారులు, ఇతర ప్రభుత్వం యంత్రాంగం తమ తమ స్థానాల్లో కొలువుదీరనున్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు రాష్ట్ర పరిపాలన మొత్తం పూర్తి స్థాయి విధులు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.

Also Read: వారంలో ఇళ్ల పట్టాల పంపిణీ…

- Advertisement -