బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇప్పుడు బాలీవుడే కాదు హాలీవుడ్ లోనూ వెలిగిపోతోంది. మే నెలలో ఈమె నటించిన హాలీవుడ్ మూవీ బేవాచ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పుడు ఓ ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రియాంక చేపట్టబోతోందని తెలుస్తోంది.
అయితే తొలి మహిళా భారతీయ వ్యోమగామి అయిన కల్పనా చావ్లా జీవిత చరిత్రను సినిమాగా మలిచేందుకు రంగం సిద్ధమవుతుండగా.. ఇందులో లీడ్ రోల్ ను ప్రియాంక చేయనుందని తెలుస్తంది. గెట్ వే అనే నిర్మాణ సంస్థ తమ తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మించనుందట. దాదాపు ఏడాది కాలం నుంచి ఈ స్క్రిప్ట్ కూడా పనులు జరుగుతున్నాయని.. ఇప్పటికే ఫైనల్ స్క్రిప్ట్ ను లాక్ చేసుకోగా.. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేసి.. ప్రాజెక్టును ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాణంలో ప్రియాంక చోప్రా కూడా భాగం కానుందని టాక్ వినిపిస్తోంది.
కల్పనా చావ్లా బయోపిక్ ద్వారా ప్రియా మిశ్రా అనే మహిళ దర్శకత్వ అరంగేట్రం చేయనుంది. ‘2011 వరకూ ఓ ఛానల్ కి క్రియేటివ్ డిపార్ట్ మెంట్ లో పని చేసిన నేను.. ఫిలిం మేకింగ్ నేర్చుకునేందుకు ఆ వృత్తిని వదిలేశాను. నేను సిద్ధం చేసుకున్న రెండు స్క్రిప్ట్ లలో కల్పనా చావ్లా ఒకటి’ అని చెప్పింది ప్రియా మిశ్రా. కొలంబస్ స్పేస్ షటిల్ పేలిపోవడంతో.. 2003లో కల్పనా చావ్లా మరణించారు. 31 రోజుల 14 గంటల 54 నిమిషాల పాటు స్పేస్ లో ఉండి రికార్డ్ సృష్టించారు కల్పనా చావ్లా.