బీజేపీకి ఆ పార్టీల భయం !

36
- Advertisement -

కర్నాటక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఆ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కన్నడ ప్రజలు ఏ పార్టీ పక్షాన నిలుస్తారనే అనే ప్రశ్న ప్రతిరోజూ ప్రతిఒక్కరిలో నానుతూనే ఉంది. కాగా ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ వంటి ప్రధాన పార్టీలు విజయంపై ధీమాగా ఉన్నప్పటికి.. మరోవైపు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఏం ఐ ఏం, ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతాయనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తికర అంశం. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మొన్నటి వరకు కాంగ్రెస్ తో కలిసున్నప్పటికి.. తాజాగా కర్నాటక ఎన్నికల బరిలో స్వతంత్రంగా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించింది.

దీంతో ఈ పార్టీ ఎవరి ఓటు బ్యాంకును చిలబోతుందనేది ఆసక్తికరమైన ప్రశ్న. ఇక ముస్లిం ఓటర్లే టార్గెట్ గా బరిలోకి దిగిన ఏం ఐ ఏం పార్టీ దాదాపు 40 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పార్టీ జేడీఎస్ తో పొత్తు కోసం ఆరాటపడినప్పటికి జేడీఎస్ మాత్రం ఆసక్తి కనబరచకపోవడంతో ఏం ఐ ఏం కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. ఇక వీటితో పాటు ఇటీవల జాతీయ స్థాయిలో రైజింగ్ పార్టీగా ఉన్న ఆప్ కూడా కర్నాటక ఎన్నికల బరిలో దిగుతోంది. ఈ పార్టీ ప్రభావం కూడా బలంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ మూడు పార్టీల ప్రభావం అధికార బీజేపీ పైనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అవినీతి, అసమర్థ పాలన అనే విమర్శలను మూటగట్టుకుంది.

Also Read: KTR:దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి…

ప్రజల్లో కూడా పార్టీపై వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక వచ్చి కాంగ్రెస్, జేడీఎస్ వంటి పార్టీలకు మేలు చేకూర్చే అవకాశం ఉంది. దాంతో సహజంగానే బీజేపీ ఓటు శాతం తగ్గుతుంది. అందువల్ల ఇదే అంశమే బీజేపీని భయపెడుతోందట. మరోవైపు బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలు కూడా ఆ పార్టీకి మైనస్ గా మారుతున్నాయి. ముఖ్యంగా సీట్లు దక్కని నేతలందరు కాంగ్రెస్ జేడీఎస్ పార్టీల చెంతకు చేరుతున్నారు. దాంతో ఆయా సీనియర్ నేతల మద్దతు దారుల ఓటు బ్యాంకు కూడా బీజేపీకి దూరం కానుంది. ఒకవైపు ఇతర పార్టీల ప్రభావం మరోవైపు ప్రధాన పార్టీల దూకుడు.. ఇంకోవైపు సొంత పార్టీలోని కుమ్ములాటలు ఇలా అన్నీ అంశాలు బీజేపీని ఓటమి అంచున నిలబెడుతున్నాయనేది కొందరి అభిప్రాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read: ఉరూరా గులాబీ జెండా పండుగ

- Advertisement -