గోపిచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ‘రామబాణం’ చిత్రం మే 5న రిలీజ్ అవుతుంది. లెక్కలు అన్నీ ఆరా తీస్తే.. నష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీనికీ ప్రధాన కారణం ఓవర్ బడ్జెట్. దర్శకుడు శ్రీవాస్ మొదట 45 టు 50 కోట్లు మధ్యలో సినిమా పూర్తి చేస్తా అని అంగీకరించాడు. కట్ చేస్తే.. సినిమా మొదలు అయ్యాక, ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఒక్క ఐటమ్ సాంగ్ విషయంలోనే శ్రీవాస్ కోటి రూపాయలు అదనంగా ఖర్చు పెట్టించాడు. ఇది ఒక్క ఐటమ్ సాంగ్ విషయంలోనే కాదు, ఫైట్స్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ ఓవర్ బడ్జెట్ కచ్చితంగా సినిమాకి నష్టం చేసేదే అని ఇప్పుడు నిర్మాతలు తీరిగ్గా బాధ పడుతున్నారు.
నిర్మాతగా టీజీ విశ్వప్రసాద్ కి మంచి క్లారిటీ ఉంది. ఆలాంటి ఆయన మరీ ఇలా ఎలా ఓవర్ బడ్జెట్ పెట్టాడు ? అంటూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి ప్రధాన కారణం.. హిట్ కాంబినేషన్ అనే లెక్కలు. గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో గతంలో ‘లక్ష్యం’, ‘లౌక్యం’ వంటి సూపర్ హిట్లు వచ్చాయి. ఇప్పుడు వారి కలయికలో హ్యాట్రిక్ ఫిల్మ్ గా ‘రామబాణం’ రాబోతోంది. కాబట్టి.. ఇది కూడా అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. సో.. నిర్మాణంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు అని రామబాణం టీమ్ అంతా బలంగా నమ్మింది.
Also Read: పిక్ టాక్ : పరువాల వరద.. ముద్దవుతున్న నెటిజన్లు
ఇప్పుడు ఆ నమ్మకమే రామబాణం నష్టాలకు కారణం అయ్యేలా ఉంది. మొత్తానికి హిట్ కాంబినేషనే నష్టాలకు కారణం అయ్యేలా ఉండటం నిజంగా విచిత్రమే. మరి నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో వస్తున్న ఈ చిత్రంతో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఎలాంటి అనుభవాన్ని పొందుతారో చూడాలి. అన్నట్టు ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా ఉన్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Also Read: Ramabanam:అందరినీ అలరించే ఎంటర్టైనర్ :డింపుల్