KTR:దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి…

39
- Advertisement -

దేశమంతా తెలంగాణ తరహా అభివృద్ధి కోసమే రూపాంతరం చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్లాలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ ప్రతినిధుల సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా పాల్గోన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..సీఎం కేసీఆర్‌ సరితూగే వ్యక్తి ప్రతిపక్షంలో లేరన్నారు.

ఒకరు మెదడు లేని బంటి…ఇంకొకరు పార్టీలు మారే చంటి..వాళ్లా ప్రతిపక్షా నాయకులు అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ గ్రామీణం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ జనభాలో 3శాతం ఉన్న తెలంగాణ గ్రామీణ అవార్డుల ఎంపికలో మాత్రం 30శాతం అవార్డులు తీసుకుంటున్నామని అన్నారు. తెలంగాణ అభివృద్ధే దేశానికి ఆదర్శమని అందుకే టీఆర్ఎస్ బీఆర్‌ఎస్‌గా మార్చామే తప్ప…జెండా, గుర్తు, డీఎన్‌ఏ మారలేదన్నారు.

గతంలో తెలంగాణ ఉద్యమం పేరుతో మోసం చేశారని అన్నారు. కానీ ఉద్యమం నుంచి తప్పుకుంటే రాళ్లతో కొట్టి చంపాలని చెప్పిన దమ్మున్న నాయకుడు మన సీఎం కేసీఆర్ అని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేండ్లలోనే ఎట్లున్న తెలంగాణ ఎంత బాగా అభివృద్ధి చెందిందో మన కండ్లముందే ఉందని…ఇదొక సజీవ సాక్ష్యమన్నారు. తెలంగాణలో ప్రతి గ్రామం ఆదర్శంగా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రారంభించిన పల్లె ప్రగతితోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లాలోని గంభీరావుపేటకు జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు వచ్చిందని చెప్పారు. గ్రామ సర్పంచ్‌ కటకం శ్రీధర్‌ను వేదికపైకి పిలిచి అభినందించారు.

Also Read: Errabelli: బుల్లెట్‌పై సందడి

తెలంగాణలో గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో రూ.4.5లక్షల కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలిపారు. రైతుల కోసం ఇంత పెద్ద మొత్తం ఖర్చు పెట్టిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. అందుకే సీఎం కేసీఆర్ సరికొత్త నినాదంతో అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్‌ అని నినదిస్తూ దేశం ముందుకు వెళ్లుతున్నామని అన్నారు. 2018లో ప్రతి కార్యకర్త తానే అభ్యర్థినన్నట్టు పని చేసి 89వేల మెజార్టీతో గెలిపించిన సంగతిని గుర్తు చేసుకున్నారు. సిరిసిల్లాలో రూ.400కోట్లతో అపారెల్ పార్క్‌ను నిర్మిస్తున్నట్టు తెలిపారు. ఈ పార్క్‌లో వర్కర్‌ టూ ఓనర్‌ పథకం అమలు చేస్తున్నామన్నారు.

Also Read: ఉరూరా గులాబీ జెండా పండుగ

- Advertisement -