తాటిబెల్లం తింటే ఎన్ని ప్రయోజనలో..!

63
- Advertisement -

తాటిబెల్లం గురించి మానందరికి తెలిసే ఉంటుంది. పంచదారకు ప్రత్యామ్నాయంగా తీపి పదార్థాలలో తాటిబెల్లన్ని వాడుతుంటారు. అయితే తాటిబెల్లంకు ఉండే వాసన కారణంగా ఇక్కువగా దీనిని ఉపయోగించేందుకు ఇష్టపడరు. అయితే చక్కెరతో పోల్చితే తాటిబెల్లం లోనే పోషక విలువలు అధికం అని నిపుణులు చెబుతున్నారు. చెరుకు నుంచి తయారు చేయబడే చక్కెరలో ఎన్నో చర్యల తరువాత పంచదార గా బయటకు వస్తుందని, అలా వచ్చిన చక్కెరతో తీపి అధికంగా ఉన్నప్పటికి పోషక విలువలు తక్కువగా ఉంటాయి. కానీ తాటిబెల్లంలో అలా కాదు తాటిచెట్టు నుంచి డైరెక్ట్ గా వివిధ దశల్లో 80 శాతం తాటిబెల్లంగా తయారవుతుంది.

Also Read: బాబోయ్.. ఆమెనే ఇలా మాట్లాడింది?

అందువల్ల చెరుకులో ఉండే పోషకాలు సమృద్దిగా తాటిబెల్లంలో ఉంటాయట. ముఖ్యంగా మన శరీరంలో తలెత్తే వివిధ రకాల అనారోగ్య సమస్యలను తగ్గించడంలో తాటిబెల్లం ఎంతగానో ఉపయోగ పడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో భాదపడే పడే వారు ప్రతిరోజూ ఉదయం ఒక చిన్న తాటిబెల్లం ముక్కను తినాలని నిపుణుల సూచన. తాటిబెల్లంలో ఇనుము, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. అందువల్ల మనశరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడే గుణం తాటిబెల్లంలో ఉంటుందట.

Also Read: ఎన్టీఆర్ తో పాన్ వరల్డ్ మూవీ!

ఇక దగ్గు, జలుబు, మైగ్రేన్ వంటి సమస్యలతో భాడపడే వాళ్ళు ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాస్ గురువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం మరియు ఒక టీ స్పూన్ తాటిబెల్లం కలుపుకొని తాగితే ఆ సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. తాటిబెల్లం ప్రతిరోజూ తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. తాటిబెల్లంలో ఉండే బైబర్ మలబద్దకనికి దివ్యఔశదంలా పని చేస్తుంది. ఇక పురుషుల్లో వీర్య వృద్దిని పెంచడంలో కూడా తాటిబెల్లం ఉపయోగ పడుతుందట. అందువల్ల ప్రతిరోజూ చక్కెరకు ప్రత్యామ్నాయంగా తాటిబెల్లం ఉపయోగించాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -