మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ వేదిక పిలుపు

36
- Advertisement -

దుబాయిలో జరిగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ షోకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. జూన్‌ 7,8వ తేదీల్లో జరిగే దుబాయిలోని జుమేరా ఎమిరేట్స్‌ టవర్ వేదిక కానుంది. తెలంగాణలో ఐటీ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన అభివృద్ధిని వివరించేందుకు నిర్వహకులు ఆహ్వానించినట్టు తెలిపారు. వివిధ దేశాల నుంచి పాల్గొంటున్న ప్రతినిధులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో తమ అనుభవాలను వివరిస్తారని నిర్వాహకులు తెలిపారు.

Also Read: సర్వే తీర్పు.. ఆ పార్టీలదే హవా !

ఈ సమావేశంలో జరిగే ప్రభుత్వ ప్రతినిధలతో పాటు ఆరోగ్య రంగం, రిటైల్ రంగం, మాన్యుఫాక్చరింగ్, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, రియల్‌ ఎస్టేట్‌, రవాణా వంటి అనేక రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఇప్పటికే విజయవంతమైన అనుభవాలను, వాటి ఫలితాలను ఈ సమావేశంలో ప్రదర్శించ‌నున్నారు. ఈ సందర్భంగా 41వ గ్లోబల్ ఎడిషన్ ఆఫ్ వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ షో కార్యక్రమంలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో అద్భుతమైన ఫలితాలు సాధించిన సంస్థలకు, వ్యక్తులకు అవార్డులు ప్ర‌దానం చేయనున్నారు.

Also Read: కాంగ్రెస్ బీజేపీ.. ఏందీ రచ్చ!

- Advertisement -