కాంగ్రెస్ బీజేపీ.. ఏందీ రచ్చ!

53
- Advertisement -

తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న వాదోపవాదాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ బీజేపీ నేత ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు హాట్ హాట్ డిబేట్లకు కారణం అవుతున్నాయి. మునుగోడు ఎన్నికల సమయంలో కే‌సి‌ఆర్ వద్ద రేవంత్ రెడ్డి రూ.25 కోట్లు తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు ఈటెల రాజేంద్ర. ఈయన చేసిన వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ నుంచి ఇటు బి‌ఆర్‌ఎస్ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమౌతున్నాయి. తాను రూ. 25 కోట్లు తీసుకున్నట్లు నిరూపిస్తే భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేసేందుకు సిద్దమే అంటూ రేవంత్ రెడ్డి ఈటెలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

నిరూపించే సత్తా ఉంటే ఈటెల రాజేందర్ కూడా ప్రమాణం చేయాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేవలం సవాళ్ళ వరకే పరిమితం కాకుండా తాజాగా భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ప్రమాణం చేసేందుకు చేరుకున్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఈటెల వర్సెస్ రేవంత్ రెడ్డి మధ్య సాగుతున్న ఈ రాజకీయ రగడ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ఈటెల రాజేంద్ర చేసిన వ్యాఖ్యలను బి‌ఆర్‌ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలా సి‌ఎం కే‌సి‌ఆర్ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నాయని బి‌ఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు.

Also Read: సర్వే తీర్పు.. ఆ పార్టీలదే హవా !

కాగా కాంగ్రెస్ బీజేపీ మధ్య జరుగుతున్న ఈ ప్రస్తుత రగడ చూస్తుంటే.. ఈ రెండు పార్టీల మైండ్ గేమ్ గా స్పష్టమౌతోంది. వచ్చే ఎన్నికల్లో అధికార దాహం తో ఉన్న ఈ రెండు పార్టీలు తరచూ వార్తల్లో నిలిచి ప్రజల ఫోకస్ తమపై పడేలా చేసుకునేందుకే ఈ కొత్త రాజకీయ డ్రామాకు తెర తీసినట్లు కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణ ప్రజలు మరోసారి కే‌సి‌ఆర్ కు అధికారం ఇచ్చేందుకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో సి‌ఎం కే‌సి‌ఆర్ పై బురద చల్లేందుకు బిజెపీ కాంగ్రెస్ చేతులు కలిపి నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు పార్టీలు ఆడుతున్న మైండ్ గేమ్ ప్రజలు తెలియంది కాదు. కాబట్టి కాంగ్రెస్ బిజెపీ ఎన్ని పన్నాగలు పన్నిన తెలంగాణ ప్రజలు మద్దతు కే‌సి‌ఆర్ కే అనేది జగమెరిగిన సత్యం.

Also Read: మొక్కలు నాటిన దసరా ఫేమ్ సోనియా…

- Advertisement -