మారుతున్న జీవనశైలి కారణంగా లేదా మనం తినే ఆహారంలో మార్పు కారణంగా గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు రావడం సర్వసాధారణం. ఈ సమస్యలు వేసవిలో ఇంకాస్త ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే వేసవిలో మనం తీసుకునే ఆహారం చాలా త్వరగా పాడవడం లేదా వేసవిలో తీసుకునే ఆయిల్ ఫుడ్స్ శరీరానికి సెట్ కాకపోవడం వంటి కారణాలతో గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు వచ్చినప్పుడు కడుపు ఉబ్బరంగాను, ఎంతో బద్దకంగాను ఉంటుంది. ఇంకా ఈ గ్యాస్, ఎసిడిటీ కారణంగా తల తిరగడంతో పాటు వాంతులు విరోచనలు కూడా మొదలయ్యే ప్రమాదం ఉంది. అయితే వేసవిలో వచ్చే ఈ ఉదర సమస్యలను తగ్గించుకోవడానికి వంటింటి చిట్కాలు అద్బుతంగా పని చేస్తాయి అవేంటో తెలుసుకుందాం !
కడుపులో ఏర్పడే గ్యాస్ సమస్యలను తగ్గించడంలో అల్లం దివ్యౌషధం ల పని చేస్తుంది. గ్యాస్ అధికంగా ఉన్నప్పుడూ చిన్న అల్లం ముక్కను నమిలి మింగాలి. దాంతో వెంటనే గ్యాస్ సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. అలాగే అల్లం టీ తగిన కూడా గ్యాస్ నుంచి త్వరగా బయట పడవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇక పుదీనా రసం, నిమ్మరసం, బేకింగ్ సోడా వంటివి కూడా గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగ పడతాయి. పుదీనా రసం గాని లేదా నిమ్మరసం గాని ఒకగ్లాస్ నీటితో కలిపి తాగితే ఆ సమస్యలు దూరమౌతాయట. ఇక వేసవిలో ప్రధానంగా వేధించే సమస్య డీహైడ్రేషన్. కొన్నిసార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా గ్యాస్, ఎసిడిటీ వంటి ప్రాబ్లమ్స్ ఏర్పాడతాయి. కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు నీరు ఎక్కువగా తాగాలి. అలాగే అలాగే నీటితో పాటు నిమ్మరసం, కొబ్బరినీళ్ళు వంటివి తీసుకుంటే మరిమంచిది.
Also read:‘పొట్టేల్’ …అనన్య నాగళ్ల బర్త్ డే స్పెషల్
30 నిముషాలు కూర్చోవాలి లేదా కొద్దిపాటి నడక చేయాలి. పడుకోకూడదు. ఒకవేళ పదుకుంటే గ్యాస్, ఎసిడిటీ సమస్యలు త్వరగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇక గ్యాస్ సమస్య నుంచి త్వరగా ఉపశమనం కలిగేందుకు లవంగాలు, దాల్చిన చెక్క, యాలకలు, జీలకర్ర తింటే కూడా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.