కాంగ్రెస్ కల్లోలం ఇప్పట్లో తగ్గదా ?

39
- Advertisement -

టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి అధికారం చేపట్టినది మొదలుకొని ఆ పార్టీకి సంబంధించిన వార్తా రోజు ఏదో ఒక కాంట్రవర్సీకి క్రియేట్ చేస్తూనే ఉంది. నిన్న మొన్నటి వరకు పార్టీలో సీనియర్స్ వర్సస్ రేవంత్ రెడ్డి మద్య జరుగుతోన్న విభేదాలు తరచూ చర్చల్లో నిలుస్తూ వచ్చాయి. అధిష్టానం జోక్యంతో ఆ వివాదం కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన ఇంకా.. నివురుగప్పిన నిప్పులా ఇంకా అలాగే ఉందనేది కొందరి అభిప్రాయం. ఇకపోతే ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో పార్టీకి తిరిగి గాడిలో పెట్టేందుకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని రేవంత్ చెబుతోంది.

Also read: కర్నాటకలో ఫ్యామిలీ పాలిటిక్స్ !

కానీ పార్టీలోని సీనియర్స్ మాత్రం రేవంత్ పాదయాత్రపై ఎడమొఖం పెడమొఖం గానే ఉన్నారు అయితే ఆ మధ్య రేవంత్ రెడ్డి పాదయాత్రకు పోటీగా ఏలేటి మహేశ్వరరెడ్డి కూడా పాదయాత్ర చేపట్టారు. కానీ మహేశ్వరరెడ్డి పాదయాత్రకు హైకమాండ్ నో చెప్పడంతో ఆయన పాదయాత్రను విరమించుకున్నారు. ఆ తరువాత మహేశ్వరరెడ్డి పార్టీని వీడారనుకోండి ! అది వేరే విషయం. ఇక పోతే ఇప్పుడు పార్టీలోని సీనియర్ నేత భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర చేస్తున్నారు. దాంతో అటు రేవంత్ రెడ్డి, ఇటు భట్టి విక్రమార్క ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు నేతలు వేర్వేరుగా పాదయాత్రలు చేస్తుండడమే చర్చకు దారితీస్తోంది. సీనియర్స్ మరియు రేవంత్ రెడ్డి మధ్య వివాదం సద్దుమనిగిందనుకుంటే భట్టి పాదయాత్రతో ఆ ఆధిపత్య వివాదం ఇంకా అలాగే ఉందనే విషయం స్పష్టమైంది.

Also read: బీజేపీ వైసీపీ దోస్తీ.. నో నో !

ఇకపోతే ఇలా సొంత పార్టీ నేతలే ఆధీపత్యం కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతుండడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపు నుంచి సి‌ఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్న తెరపైకి వస్తోంది. కాగా టీపీసీసీ చీఫ్ గా సి‌ఎం అభ్యర్థి రేస్ లో రేవంత్ రెడ్డి పేరే ప్రధానంగా వినిపించే అవకాశం ఉన్నప్పటికి.. తాము కూడా రేస్ లో ఉన్నమంటూ సీనియర్స్ చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సి‌ఎం అభ్యర్థిగా ఉండడానికి తాను సిద్దమేనని, అధిష్టానం ఆదేశిస్తే కచ్చితంగా సి‌ఎం అభ్యర్థి రేస్ లో ఉంటానని భట్టి విక్రమార్క ఇటీవల చెప్పుకొచ్చారు. దీంతో కాంగ్రెస్ తరుపున సి‌ఎం అభ్యర్థి ఎవరనే చర్చ ఊపందుకుంది. మొత్తానికి టి కాంగ్రెస్ లోని సీనియర్స్ వర్సెస్ రేవంత్ రెడ్డి వ్యవహారం హస్తం హైకమాండ్ కు భారం తగ్గని తలపోటులాగే ఉంది. మరి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సి‌ఎం అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

- Advertisement -