పవన్ తో ప్రియాంక రొమాన్స్

46
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమా OG (వర్కింగ్ టైటిల్). యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతుంది. నిన్ననే సెట్స్‌ పైకి పవన్ కళ్యాణ్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా హీరోయిన్ కూడా ఈ సినిమా షూట్ లో జాయిన్ అయింది. నాని గ్యాంగ్ లీడర్‌ తో టాలీవుడ్‌లోకి అరంగేట్రం చేసిన ప్రియాంక అరుల్ మోహన్ ఈ పవర్‌ ఫుల్ మూవీలో కథానాయికగా నటిస్తున్నట్లు ఈ రోజు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. OG టీమ్ నుంచి అధికారికంగా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

Also read: ఏప్రిల్ 23న..వీరమాస్ బ్లాక్‌బస్టర్ 100 డేస్ సెలబ్రేషన్స్

ప్రస్తుత షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల పై ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని DVV దానయ్య నిర్మిస్తుండగా.. అనిరుధ్ స్వరాలు సమకూరుస్తున్నారు. పైగా పవర్ స్టార్ సినీ కెరీర్ లోనే మోస్ట్ వైల్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం రాబోతుంది. అయితే, ఈ సినిమా షెడ్యూల్స్ విషయంలో ఓ సమస్య ఉంది. సుజిత్ రాసుకున్న యాక్షన్ థ్రిల్లర్ కి పవన్ కళ్యాణ్ ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంది.

Also read: Agent: ఆరు దేశాల్లో

కానీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోసమే ఎక్కువ డేట్స్ కేటాయించే పరిస్థితి లేదు. హరిహర వీరమల్లు సినిమా అందుకే లేటు అవుతూ వస్తోంది. ఇప్పుడు సుజిత్ సినిమాకి కూడా అదే గతి పడుతుంది అని అంటున్నారు. మరి ఏం అవుతుందో చూడాలి. ఒక్కటి అయితే వాస్తవం.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న అన్నీ సినిమాల్లో కల్లా ఎక్కువ ఆసక్తి పెంచుతున్న సినిమా మాత్రం ఇదే.

- Advertisement -