మరో ఆసక్తికర సమరానికి నేటి ఐపీఎల్ వేధిక కానుంది. నేటి ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై తో బెంగళూరు తలపడనుంది. రాత్రి 7:30 నిముషాలకు చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీమిండియా మిస్టర్ కూల్ గా పేరుగాంచిన ఎంఎస్ ధోని, కింగ్ కోహ్లీ జట్లు కావడంతో ఐపీఎల్ అభిమానుల దృష్టి ఈ మ్యాచ్ పై పడింది. ఇక ఇప్పటివరకు ఈ రెండు జట్ల మద్య ఐపీఎల్ మొత్తంలో 30 మ్యాచ్ లు జరగగా, అందులో 19 మ్యాచ్ ల్లో ఛెన్నై విజయం సాధిస్తే.. 10 మ్యాచ్ ల్లో బెంగళూరు విజయం సాధించింది. ఒక్క మ్యాచ్ టై గా ముగిసింది. ప్రస్తుతం ఐపీఎల్ లో చెరో నాలుగు మ్యాచ్ లు ఆడిన ఇరు జట్లు చెరో రెండు విజయాలను ఖాతాలో వేసుకొని సమంగా ఉన్నాయి. .
ఇక గత మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో ఛెన్నైకి ఓటమి తప్పలేదు. కానీ ధోని ఫామ్ లోకి రావడం.. తనదైన రీతిలో చెలరేగడం ఛెన్నై కి కలిసొచ్చే అంశం. దాంతో బెంగళూరుపై విజయం సాధించి సత్తా చాటలని చూస్తోంది ఛెన్నై. ఇక బెంగళూరు విషయానికొస్తే.. డిల్లీతో జరిగిన గత మ్యాచ్ లో విజయం సాధించి జోరుమీద ఉంది. అదే జోరు కొనసాగిస్తూ ఛెన్నై పై కూడా సత్తా చాటలని చూస్తోంది కోహ్లీ సేన. ఇరు జట్ల బలా బలాల విషయానికొస్తే డేవిడ్ కాన్వే, రహనే, జడేజా, ఎంఎస్ ధోని ఫామ్ లో ఉండడం ఛెన్నై కి సానుకూలాంశం. ఇక బైలింగ్ లోనూ రాణిస్తే ఛెన్నై కి తిరుగుండదు. ఇక ఆర్సీబి లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ డూప్లిసిస్ ఫుల్ ఫామ్ ఉన్నారు. వీరికి తోడు మాక్స్ వెల్, లోమ్రోర్ వంటి వాళ్ళు కూడా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరును కట్టడి చేయడం ఛెన్నైకి కష్టమే. మరి అన్నీ విభాగాల్లోనూ సమవుజ్జీలుగా ఉన్న ఇరు జట్లలో విజయం ఏ జెట్టును వరిస్తుందో చూడాలి.
ఇక నిన్న జరిగిన డబుల్ బొనంజా మ్యాచ్ లలోకోల్ కతా పై ముంబై ఇండియన్స్ విజయం సాదించగా, అలాగే రాత్రి 7:30 నిముషాలకు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ పై రాజస్తాన్ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి..