ఏపీలో గత కొన్ని రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కేంద్రం బిడ్డింగ్ కు సిద్దమైన వేళ అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ అంశంలోకి ఎంట్రీ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోతున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించినప్పుడు అన్నీ వైపులా నుంచి వ్యతిరేకత ఏర్పడింది. ప్రధాన పార్టీలన్నీ కూడా కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. మరోవైపు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనల బాటా పట్టారు. అయితే ఇంత జరిగిన ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎట్టి పరిస్థితుల్లో విశాఖా స్టీల్ ప్లాన్ ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం ఖరకండిగా చెప్పడంతో అంతా కూడా సైలెంట్ అయ్యారు.
అసలు స్టీల్ ప్లాంట్ ప్రస్తావనే మరచిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో బిడ్డింగ్ కు తెరతీసిన కేంద్రానికి ఊహించని విధంగా తెలంగాణ ముఖమంత్రి కేసిఆర్ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ ప్రైవేటీకరణకు బిఆర్‌ఎస్ వ్యతిరేకమని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రభుత్వ ఆస్తులను కాపాడుకుంటామని కేసిఆర్ రంగంలోకి దిగడంతో కేంద్ర చర్యలకు చావు దెబ్బ తగిలింది. మోడీ మిత్రపక్షం గా ఉన్న ఆధాని ఆదాయం పెంచేందుకే విశాఖను ప్రైవేటీకరణ చేయబోతున్నారని, కేంద్రం దుశ్చర్య ను అడ్డుకుంటామని, బిడ్డింగ్ లో కూడా పాల్గొంటామని చెప్పడంతో కేసిఆర్ చోరువకు కేంద్రప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అవుతోంది.
అంతే కాకుండా సింగరేణి అధికారులను సైతం విశాఖ స్టీల్ వద్దకు పంపడంతో.. దెబ్బకి కేంద్రం వెనక్కి తగ్గక తప్పలేదు. కేసిఆర్ దూకుడు కు వెనుకడుగు వేసిన కేంద్రం ఇప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని చెప్పింది. అయితే ప్రైవేటీకరణ రద్దు అంశాన్ని పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వకపోయినప్పటికి.. కేంద్రం వెనక్కి తగ్గడ గమనార్హం. ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ ప్రైవేటీకరణ రద్దు విషయంలో గట్టిగానే పోరాడినప్పటికి ఏ మాత్రం ఖాతరు చేయని కేంద్రం.. కేసిఆర్ రంగంలోకి దిగగానే వెనక్కి తగ్గడంతో ఏపీ నేతలు కేసిఆర్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
ఇవి కూడా చదవండి…